నేడు సుప్రీంకోర్టులో మూడు రాజధానులు కేసు విచారణ జరగనుంది. అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై స్టేటస్ కో విధించింది ఏపీ హైకోర్టు....స్టేటస్ కో ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. ఇప్పటికే రాజధానుల కేసు రెండు బెంచ్ల ముందు "నాట్ బిఫోర్ మీ" అయింది. ఈ తరుణంలో మూడు రాజధానులు కేసును జస్టిస్ అశోక్ భూషణ్ , జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ జరపనుంది.