ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 159వ జయంతి

యువత స్వామి వివేకానంద ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చిన: ఎబివిపి జిల్లా ప్రముఖ్ దొరబాబు గారు

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి గూడూర్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక డి ఆర్ డబ్ల్యు కళాశాలలో 159 వ స్వామి వివేకానంద జయంతిని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా ప్రముఖ్ దొరబాబు గారు మాట్లాడుతూ యువత విద్యార్థులు స్వామి వివేకానంద గారిని ని ఆదర్శంగా తీసుకుని ఈ దేశం కోసం పని చేయాలని, ప్రపంచానికి భారతదేశం యొక్క గొప్పతనాన్ని కీర్తిని చాటిన గొప్ప వ్యక్తి ఇ స్వామి వివేకానంద గారి అని యువత కు సంబంధించిన అనేక స్ఫూర్తి విషయాలను మార్గదర్శనం చేసినటువంటి స్వామి వివేకానంద గారి ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన అన్నారు, మరియు ఎబివిపి నెల్లూరు విభాగ్ కన్వీనర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ వివేకానందుని మాట ఏబీవీపీ బాట అనే ఆశయాలతో ఏబీవీపీ ఎప్పుడూ కూడా స్వామి వివేకానంద గారి ని ఆదర్శంగా తీసుకుని దేశం కోసం పని చేస్తున్న విద్యార్థి సంఘం అని, విద్యార్థులు యువత కూడా స్వామి వివేకానంద ఆశయాలను నెరవేర్చే విధంగా అందరూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని యువతకు జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డి ఆర్ డబ్ల్యు కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు గారు, RSS జిల్లా భౌదిక్ ప్రముఖ్ మల్లికార్జున గారు, ఏబీవీపీ హాస్టల్స్ కన్వీనర్ చిన్న, నగర కార్యదర్శి కార్తీక్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హర్షవర్ధన్, చైతన్య, శంకర్ కార్తీక్, నవీన్, ప్రదీప్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు