బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని వి.ఆర్.సి. సెంటర్ నందు గల  ఆయన విగ్రహానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన ఆయన సేవలు మరువలేనివని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు దార్ల వెంకటేశ్వర్లు, నీలి రాఘవరావు, వేలూరు మహేష్, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనీల్ బాబు, బి.సి. కార్పొరేషన్ చైర్మన్లు నారాయణ ముదిరాజ్, సయ్యద్ ఆసిఫా, వావిలేటి ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.