నెల్లూరు, జనవరి 23, (రవికిరణాలు) : సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య ఆధ్వర్యంలో సుభాష్‌ చంద్రబోస్‌ 123వ జయంతి వేడకలను ఘనంగా నిర్వహించారు. పోరాట సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి కేక్‌కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిషువారితో పోరాడిన ధైర్యశాలి ధీరుడు బోస్‌ అని ఆయన పోరాటం ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్‌.మోహన్‌రెడ్డి, ఎన్‌.వి కృష్ణయ్య, కె.జయరామరాజు, కె.దయాకర్‌యాదవ్‌, వి.శంకర్‌, పి.ప్రసన్నకుమార్‌, వంశీ, ఎమ్‌.వెంకట రామరాజు తదితరులు పాల్గొన్నారు.