నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అధికారులు, ఉపాద్యాలు, ప్రజాసంఘాల నాయకులు  ఘనంగా  బాబు జగ్జీవన్ రాం 113 వ  జయంతి వేడుకల ను నిర్వహించారు.ఈ సందర్భంగా అయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీహార్ లోని ఒక మారుమూల ప్రాంతంలో, ఒక సామాన్య దళిత కుటుంబం లో జన్మించి, స్వయంకృషితో దేశం గర్వించ దగ్గ జాతీయ నాయకుడిగా ఎదగడం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన తన వ్యూహాత్మక ఆలోచనలతో, అణగారిన దళితుల అభ్యున్యతికి వారి హక్కుల పరిరక్షణ కోసం ఎంతో కృషి చేశారన్నారు.