కార్యకర్తల ఇబ్బందిని తమ ఇబ్బందిగా భావించి వారికి సహకరించడం ద్వారా పార్టీ ని మరింత బలోపేతం చేయాలి,..... 
లీగల్ సెల్ సమావేశం లో మనుక్రాంత్
జనసేనపార్టీ నెల్లూరుజిల్లా లీగల్సెల్ సమావేశం 

నెల్లూరు జిల్లా జనసేన లీగల్ సెల్ ఇంచార్జ్ చదలవాడ రాజేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నారెడ్డి మనుక్రాంత్  ఏర్పాటుచేసిన సమావేశంలో పలువురు లాయర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లీగల్ సెల్  సభ్యులు మాట్లాడుతూ పార్టీ తరఫున సమస్యలను తాము అండగా ఉంటామని జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రతి శని ఆదివారం కొంత సమయాన్ని వెచ్చించి జనసేన కార్యకర్తలకు అవసరమైన న్యాయ పరమైన సహాయం ను అందించి వారికి భరోసా ఉంటామని హామీ ఇచ్చారు. చెన్నారెడ్డి మనుక్రాంత్ మాట్లాడుతూ లీగల్ కమిటీ సమావేశం లో ఇంతమంది లాయర్లు స్వచ్ఛందంగా పాల్గొనడం ఆనందంగా ఉందని మేము కూడా న్యాయవాది కుటుంబం నుంచి వచ్చినందున అందరం సుపరిచితులమేనని ని నేడు ప్రభుత్వ విధి విధానాలను ప్రజలు విసిగిపోయి ఉన్నారని న్యాయవాదులు సహాయ సహకారాలు అందించి సామాన్యుడి కి అందుబాటులో ఉండే జనసేన పార్టీ ని, పవన్ కళ్యాణ్ ని అధికారంలోకి తేవాలని తెలిపారు నిజాయితీగా కష్టపడే కార్యకర్తలకు న్యాయం సహకారం అందించడం ద్వారా, మండల కమిటీ లో న్యాయవాదులకు స్థానం కల్పించడం ద్వారా, కార్యకర్తల  ఇబ్బందిని  తమ ఇబ్బందిగా భావించి వారికి సహకరించడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చిరంజీవి ,వెంకటేశ్వర్లు,   రావు, గురుకుమార్, శరత్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు