టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి  సీవీఆర్
ప్రాంతాలకు, పార్టీల కతీతంగా అందరూ ఉద్యమించాలని పిలుపు 

కోవూరు, జనవరి 07, (రవికిరణాలు)  : అమరావతి రాజధాని సమస్య ఆ ప్రాంతంలో భూములిచ్చిన రైతుల సమస్య మాత్రమే కాదని  ఆంధ్రుల అందరి సమస్య అని, దీనికోసం రాష్ట్రములోని రాజకీయ పార్టీలు,ప్రజాసంఘాలు అందరూ కలసి ప్రాంతాలకు అతీతంగా, పార్టీల కతీతంగా ఉద్యమించి అమరావతిని కాపాడుకోవలసిన సమయం వచ్చినదని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. మంగళవారం కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయములో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి  వై యెస్ జగన్మోహన్ రెడ్డి  రాజకీయ,వ్యక్తిగత కక్ష సాధింపు కోసం రాష్ట్ర భవిష్యత్తుతో  ఆటలాడుకుంటున్నారని, నిండు శాసనసభలో నాటి ప్రతిపక్ష నాయకుడిగా అమరావతిని రాజధానిగా అంగీకరించి,నేడు అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులు ఏర్పాటు చేస్తానని అంటున్నారని, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రతిపాదిస్తున్న విశాఖ అందరికి అందుబాటులో ఉండే నగరం కాదని,అదేకాకుండా సచివాలయం ఒక ప్రాంతంలో, అసంబ్లీ ఒక ప్రాంతంలో, హైకోర్టు ఒక ప్రాంతంలో ఉండటం వలన ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తహసీల్దార్ కార్యాలయము ఒక ఊరిలో,సమితి కార్యాలయము ఒక ఊరిలో,పోలీస్ స్టేషన్ ఒక ఊరిలో ఈ విధంగా ఒక్కొక్క ప్రభుత్వ కార్యాలయం ఒక్కొక్క ఊరిలో ఉండటం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న తరుణములో నందమూరి తారక రామారావు  మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి మండల కేంద్రంలోనే అన్ని శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయడము వలన మండల కేంద్రానికి వచ్చిన వారు అన్ని పనులు చూసుకొని వెళుతున్నారని,కావున రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండి, అన్ని కార్యాలయాలు అక్కడే ఉంటేనే అందరికి సౌకర్యంగా ఉంటుందని, రాష్ట్ర రాజధాని అంటే కేవలం పాలనా కేంద్రమే కాదని,ఉపాధి,ఆర్ధిక కార్యాకలాపాల వేదిక అని,దేశంలోని ఏ రాష్ట్రాన్ని తీసుకున్న ఆ రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలో అధిక భాగం ఆ రాష్ట్ర రాజధాని నుండే వస్తుందని,
ముఖ్యమంత్రి  వై యెస్ జగన్మోహన్ రెడ్డి  చేస్తున్న మూడు రాజధానులు వలన భవిష్యత్తు లో రాష్ట్రం త్రీవరంగా నష్టపోతుందని కావున రాష్ట్రములోని రాజకీయా పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి,యువజన సంఘాలు,మేధావులు అందరూ ఏకమై అమరావతి రాజధాని కోసం పోరాటం చేసి రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన సమయం వచ్చిందని అన్నారు. ఈ కార్యాక్రమములో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏలూరు కృష్ణయ్య, శివుని రమణారెడ్డి, జొన్నదుల రవికుమార్,ఒబ్బారెడ్డి మల్లికార్జున రెడ్డి,  కలికి సత్యనారాయణ రెడ్డి, ఇందుపురు మురళీకృష్ణ రెడ్డి, ఉయ్యురు వేణు, గుంజి పద్మనాభం, పూల వెంకటేశ్వర్లు, బుధవరపు శివకుమార్,కలువాయి చెన్నకృష్ణారెడ్డి, అగ్గి మురళి, దువ్వూరు రంగారెడ్డి, జానకిరామ్, గరికిపాటి అనిల్ తదితరులు పాల్గొన్నారు.