"సోమిరెడ్డికి సవాల్ విసిరిన వైకాపా నాయకులు"


శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మందల వెంకటశేషయ్య, మాజీ జెడ్పిటిసి సభ్యులు మరియు రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నెల్లూరు శివ ప్రసాద్, నెట్ క్యాప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, మండల పరిషత్తుల అధ్యక్షులు, జెడ్పిటిసి సభ్యులు మరియు వైకాపా నాయకులు. 

 సోమిరెడ్డి, మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి పై చేసిన విమర్శలకు దమ్ముంటే, నిరూపించాలని సవాల్ విసురుతున్నాం.  ముత్తుకూరు దగ్గర ట్రైలర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తే, స్థానికులకు అండగా నిలిచి, అసోసియేషన్ కు మద్దతు ఇవ్వడం తప్ప, గోవర్ధన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు.  సోమిరెడ్డికి నీతి, నిజాయితీ ఉంటే, ట్రైలర్స్ అసోసియేషన్ లావాదేవీలు, సోమిరెడ్డి సూచించిన ఆడిటర్ వద్ద కానీ, లేదా సోమిరెడ్డి సూచించిన ఏ వ్యక్తి వద్దైనా గానీ, మొత్తం అకౌంట్ అసోసియేషన్ ప్రతినిధుల నుండి అందజేస్తాం.   సోమిరెడ్డి ఏర్పాటు చేసిన మనుషులు నేరుగా వచ్చి, ట్రైలర్స్ అసోసియేషన్ ఆఫీసులో కూర్చొని, లావాదేవీలు స్వయంగా పరిశీలించి,  అకౌంట్ పరిశీలించిన  తర్వాత వాస్తవాలు వెలుగు చూస్తాయి.  స్థానికంగా ఉండే ట్రైలర్స్ యజమానులు నష్టపోకుండా, అండగా నిలువడానికి అసోసియేషన్ కు మద్దతు పలికాం తప్ప, సోమిరెడ్డి లాగా స్వార్ధ ప్రయోజనాలకు పాల్పడటానికి కాదు.  సోమిరెడ్డిలాగా దిగజారి అవినీతికి పాల్పడి, అవినీతి సొమ్ము కోసం పాకులాడే వలసిన ఖర్మ వైకాపా నాయకులకు లేదు.  సోమిరెడ్డి ఊర కుక్కలాగా మొరగడం మాని, మా సవాలును స్వీకరించి, అసోసియేషన్ కార్యాలయాన్ని సందర్శించి, రికార్డులను పరిశీలించిన తర్వాత సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పని తేలితే, సోమిరెడ్డిని దేనితో కొట్టాలో ముందుగానే సోమిరెడ్డి తెలియజేయాలి.  సోమిరెడ్డి లాగా షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు అమ్ముకోవడం, రేషన్ డీలర్ షిప్ ఇప్పించేందుకు డబ్బులు తీసుకోవడం, అంగన్వాడీ పోస్టులకు వెలకట్టి వసూళ్లు చేయడం లాంటి దిగజారుడు అలవాట్లు అందరికీ ఉంటాయనుకోవడం సోమిరెడ్డి భ్రమ.  సోమిరెడ్డి తనకు హక్కులేని పరాయివారి భూములను మద్రాసులోని అమాయకులకు అమ్మి సొమ్ము చేసుకున్న తప్పుడోడికి మరొకరి గురించి మాట్లాడే అర్హత ఉందా!  సోమిరెడ్డి అధికారులు చేసిన తప్పులను ప్రజాప్రతినిధులపై రుద్దటం అధికారులను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేయడం మొదటి నుండి ఆనవాయితీ.  అడ్డాలోడు.., సోమిరెడ్డి తాను అవినీతికి పాల్పడలేదని దేవుని దగ్గర ప్రమాణం చేయమని పలుమార్లు విజ్ఞప్తి చేస్తే, పలాయనం చిత్తగించి పారిపోయాడు.  సోమిరెడ్డి లాగా నీచమైన అవినీతి బతుకు బ్రతకడం కన్నా చావడం మేలని మేము భావిస్తాం.  సర్వేపల్లి నియోజకవర్గంలో అధికారులను అవినీతి పనులకు ప్రోత్సహించడం కాదు, అడ్డగోలు పనులు చేయ్యమని కూడా ఎప్పుడూ ఒత్తిడి చెయ్యం.  సోమిరెడ్డి లాగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని, తప్పుడు పనులు చేయమని అధికారులను ప్రేరేపించే, సోమిరెడ్డి లాంటి వ్యక్తులం కాదు.  సోమిరెడ్డి ఆనాటి తహశీల్దార్ ను తాను సూచించిన వారికి పని చేయడం లేదంటూ, దుర్భాషలాడటంతో, తహశీల్దార్ నోరు మూసుకోమని హెచ్చరిస్తూ, ఎక్కువగా మాట్లాడితే సోమిరెడ్డిని దేనితో కొడతానని వార్నింగ్ ఇచ్చారో, సోమిరెడ్డి బహిరంగ పరచాలి.  సోమిరెడ్డిని నోరు మూసుకోమని దానితో కొడతానని హెచ్చరించడంతో, తహశీల్దార్ పై ద్వేషం పెంచుకున్న సోమిరెడ్డి ఆనాటి నుండి తహాశీల్దార్ పై అనేక ఆరోపణలు గుప్పిస్తూ, అవి మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు.  సోమిరెడ్డికి నీతి, నిజాయితీ ఉంటే, అవినీతిలో వైకాపా నాయకుల పాత్రను కృష్ణపట్నం ట్రైలర్ అసోసియేషన్ లో తానే ఆడిటింగ్ జరిపించి, వాస్తవాలను ప్రజలకు వెల్లడించమని సవాల్ విసురుతున్నాం.  సోమిరెడ్డి కడుపుకు అన్నం తింటే, తప్పుడు కూతలు కూసి, బురదజల్లి పారిపోకుండా, మా విచారణకు సిద్ధపడి, తనది నీతి, నిజాయితీతో కూడిన పుట్టుకని నిరూపించుకోవాలి.  సోమిరెడ్డి, మేము విసిరిన సవాల్ ను స్వీకరించి, బహిరంగ విచారణకు సిద్ధపడి, తేది, సమయం ప్రకటిస్తే, తాను చేస్తున్న అన్ని ఆరోపణలపై  వాస్తవాలు తెలుస్తాయి గనుక, తక్షణమే స్పందించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.