"జిల్లా ప్రజలకు కాకాణి ధన్యవాదాలు"శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

 ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జెడ్పిటిసి, యం.పి.టి.సి. ఎన్నికల్లో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి, వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి అండగా నిలిచారు.  వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా తయారైంది. జెడ్పీటీసీ, యం.పీ.టీ.సీ. ఎన్నికల్లో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రజలు తీర్పు నిచ్చారు. రెండేళ్ల ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు యం.పి.టి.సి., జెడ్పిటిసి ఫలితాలు రెఫరెండం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకతీతంగా అందిస్తున్న సంక్షేమానికి ప్రజలు అండగా నిలిచారు. వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా పరిషత్ ఎన్నికల్లో 100 శాతం జెడ్పీటీసీలను గెలుచుకొని, జిల్లా పరిషత్ ను కైవసం చేసుకున్నాం.  జిల్లాలోని 46 పరిషత్తులలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. నెల్లూరు జెడ్పీ లో అడుగు పెట్టె అర్హత కూడా టీడీపీకి జిల్లా వాసులు ఇవ్వలేదు.  ప్రాంతాలు, కులాల మధ్య సమానత్వంతో జెడ్పీ పదవులను ముఖ్యమంత్రి గారు ఇచ్చారు.


టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా, ఫలితం లేకుండాపోయింది.

2014 లో అధికారాన్ని అడ్డు పెట్టుకొని జెడ్పీ ఛైర్మెన్ ఎన్నికలో టీడీపీ జులుం చేసింది. టీడీపీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. అబద్దాల టీడీపీకి పరిషత్ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు లాంటిది.  జిల్లా పరిషత్, మండల ప్రజా పరిషత్తులకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు నా హృదయపూర్వక అభినందనలు. జిల్లాలో ఎన్నికలు సక్రమంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ గారికి, యస్.పి.గారికి, అధికారులందరికీ హృదయపూర్వక అభినందనలతోపాటు, ధన్యవాదాలు.  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించేందుకు శ్రమించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఆశీస్సులు అందించిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.