"కాకాణి చేతులు మీదుగా  పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు"


శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లిగూడూరు గ్రామ పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. తోటపల్లిగూడూరు మండలంలో 104 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, తాగునీరు, సాగునీరు కల్పన కోసం ఖర్చు చేశాం. తోటపల్లి గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలో 3 కోట్ల 85 లక్షలు వెచ్చించి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.  రైతాంగానికి అవసరమైన కలుజు నిర్మాణం కోసం 40 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి, శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాం.  నాడు-నేడు పథకం కింద పాఠశాలలకు అవసరమైన మరమ్మత్తులతోపాటు, పూర్తిస్థాయి వసతులు కల్పించాం. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా అడ్డు తగులుతుంది. చంద్రబాబు నాయుడు ధ్యాసంతా తన కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలనే తపన తప్ప, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డిగారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల రోజురోజుకి ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెరగడం పట్ల ఆందోళనతో, చంద్రబాబు బురద జల్లుతున్నాడు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి నిరంతరం కృషి చేస్తాను