"కాకాణి చేతుల మీదుగా కొత్త పెన్షన్ల పంపిణీ"

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలో కొత్తగా మంజూరైన పెన్షన్ల పంపిణీ చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నూతన సంవత్సర కానుకగా 2,250 రూపాయల పెన్షన్ 2500/- రూపాయలకు పెంచడం ప్రజలకు ఎనలేని సంతోషాన్నిస్తుంది. భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎక్కువ మొత్తం పెన్షన్ ను ఎక్కువ మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చంద్రబాబు హయాంలో పెన్షన్ల కొరకు నెలకు 400 కోట్లు ఖర్చు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 38,573 కుటుంబాలకు ప్రతి నెల 9 కోట్ల 65 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నాం.  జగ్మోహన్ రెడ్డి గారు రైతాంగానికి హామీ ఇచ్చిన దాని కన్నా మిన్నగా "వై.యస్.ఆర్. రైతు భరోసా" కార్యక్రమం ద్వారా ఆర్ధిక సహాయం అందజేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామాలలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల రూపకల్పన కోసం నిత్యం శ్రమిస్తున్నాం.  సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారందరికీ అందించే బాధ్యత నాది. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా, ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.