"అంధ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతాం."


బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లాశాఖ ఆద్వర్యం లో నరేంద్ర మోడీ 71 వ జన్మదినం మరియు గుజరాత్ ముఖ్యమంత్రి గా 13 సంవత్సరాలు , ప్రధానమంత్రిగా 7 సంవత్సరాలు మొత్తం 2౦ సంవత్సరాలు  పూర్తి చేసిన సందర్బంగా 2౦ రోజుల పాటు 20 మండలంలో సేవ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం 11:౦౦ గంటలకు రాజరాజేశ్వరి గుడి ప్రక్కన ఉన్న విశ్వభారతి అంధుల పాఠశాల నందు విద్యార్థినీ విద్యార్థులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది." 

        పై కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు " ముక్కు రాధాకృష్ణ  గౌడ్ " మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాలను తాము అన్నివిధాలా ఆదుకుంటామని "విద్య , వైద్యం , ఆహరం , ఉద్యోగ ఉపాధికల్పన విషయం లో అండగా ఉంటాను అన్నారు , విద్యార్థి , యువతను అన్ని రంగాలలో ఉన్నతిని సాధించే దిశగాపోర్చహిస్తామన్నారు . బడుగు బలహీన  వర్గాల అంద విద్యార్థినీ విద్యార్థులకు వారి జీవితంలో వెలుగులు నింపే విధంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామన్నారు , వృద్దులు ఆనాధలు , ఆబాగ్యులకు తగిన సహాయ సాకారాలు , సేవ కార్యక్రమాలు ద్వారా సామాజి ఉన్నతిని  కాంషిస్తున్నామన్నారు .

పై  కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా  ప్రధాన కార్యదర్శి "కోసూరి.వెంకటసుధీర్ , జిల్లా ఓబిసి ఉపాధ్యక్షులు బృంగి మల్లేశ్వరరావు , జిల్లా ఓబిసి కార్యదర్శులు ఆవుల యాదగిరి, గుంజి  కృష్ణ,  జిల్లా  ఓబిసి లీగల్ సెల్ కన్వినర్ రేలంగి.నీలకంఠ, బిజెపి  వేదాయపాలెం మండల అధ్యక్షులు  పి.మల్లికార్జున బిజెపి వేదయపాలెం మండల ప్రధాన కార్యదర్శి హరికృష్ణ  ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు వాడపర్తి.ప్రవీణ్, బిజెపి నాయకులు చెన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మత్స్యకార సెల్ కన్వీనర్ కె.గాంధీ  తదితరులు పాల్గొన్నారు .