కాకాణి చేతులమీదుగా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ల అందజేత"*

*" కాకాణి చేతులమీదుగా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ల అందజేత"*

తేది:11-06-2021
*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల పరిషత్ కార్యాలయంలో "ఐ- ఫీడ్" కంపెనీ అందజేసిన 15 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను పంపిణీ చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

*సర్వేపల్లి నియోజకవర్గంలో పనిచేసే అధికారులు, వివిధ కార్యాలయాలు మరియు సచివాలయ సిబ్బందికి ఆనందయ్య ఆయుర్వేద మందును పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.*

*స్క్రోలింగ్ పాయింట్స్:*

👉 కరోనా రెండో విడత అనేక మంది ప్రాణాలు తీసుకుని అనేక కుటుంబాలకు అంతులేని విషాదాన్ని కలిగించింది.

👉 కరోనా రెండో విడత ఉధృతమవుతున్న పరిస్థితులలో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచి వివిధ ఆస్పత్రులలో కరోనా సోకిన వారికి అవసరమైన ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేశాం.

👉 పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 30 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేసి, పౌష్టికాహారాన్ని అందించి, ఎంతోమంది ప్రాణాలు కాపాడగలిగాం.

👉 పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి 11 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందించడంతో పాటు, అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేసి, అవసరమైన సిబ్బందిని నియమించి, ప్రాణనష్టం జరగకుండా నివారించగలిగాం.

👉 కోవిడ్ నేపథ్యంలో పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రం విశేష సేవలు అందించి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక *"కాయకల్ప అవార్డు"* లలో ప్రథమ స్థానం సాధించి, నెల్లూరు జిల్లాకే తలమానికంగా నిలిచింది.

👉 కరోనా కష్టకాలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో అవసరాలకు 32 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు 60  పల్స్ ఆక్సిమీటర్లు అందజేశాం.

👉 కరోనా మూడో విడతను దృష్టిలో ఉంచుకొని, అత్యవసర వినియోగం కోసం, నియోజకవర్గంలోని అన్ని ఆసుపత్రులతో పాటు 5 మండల పరిషత్ కార్యాలయాలలో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను మండల పరిషత్ అభివృద్ధి అధికారుల ఆధీనంలో ఉంచాం.

👉 అత్యవసరానికి అంబులెన్స్ రాక ఆలస్యమైనా, ఆక్సిజన్ స్థాయి పడిపోకుండా మండల పరిషత్ కార్యాలయాల్లో ఉన్న కాన్సెంట్రేటర్లను అవసరమైన వాళ్ళు ఇళ్లకు తీసుకొని వెళ్లి, వాడుకునే వెసలుబాటు కల్పించాం.

👉 ఆనందయ్య సహకారంతో ఆయుర్వేద మందును సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి అందించాం.

👉 సర్వేపల్లి నియోజకవర్గంలో పనిచేసే అధికారులందరికీ రేషన్ కార్డు లేకపోయినా, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కార్మికులకు, ఇతరులకు ప్రతి ఒక్కరికీ ఆయుర్వేద మందు పంపిణీ చేస్తాం.

👉 సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ, సేవా కార్యక్రమాలు ఎన్నడూ లేని విధంగా కొనసాగుతుండడంతో భరించలేక, కడుపుమంటతో కొందరు అనవసర విమర్శలకు దిగుతున్నారు.

👉నేటి తరంలో ఏమాత్రం విలువలు, విశ్వసనీయత, నీతి, నిజాయితీ లేని కొందరిని పాతతరం నాయకులతో పోల్చడం నా మనసుకు బాధ కలిగించింది.

👉 హుందాతనంలేని రాజకీయ నాయకులు ఇష్టారీతిగా, అడ్డగోలుగా విమర్శలు చేస్తే, ధీటుగా సమాధానం ఇస్తాం తప్ప, వివరణతో సరిపెట్టం.

👉 సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలిచి, మూడో విడత కరోనా హెచ్చరికలు అందుతున్న నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో ఎవ్వరూ కరోనా బారిన పడి, నష్టపడకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget