దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేద్దామా జగన్.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

 
దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేద్దామా జగన్..

👉.. సవాల్ చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు


ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ముగ్గురు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని రేపు తిరుపతిలో గెలుపొందే పనబాక లక్ష్మితో కలుపుకుంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం నలుగురు ఎంపీలు రాజీనామా చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ కు ఉన్న 21 ఎంపీల చేత రాజీనామాలు చేయించే దమ్ము ధైర్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఉందా అని టిడిపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు. సూళ్లూరుపేట  తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో తనకు అత్యధిక ఎంపీలు ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ నేడు సాగిలపడ్డాడని ధ్వజమెత్తారు.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని ఇప్పటికే ఆ పార్టీ నాయకులకు అర్థం అయిందని దీంతో రేపటి నుంచి డబ్బు సంచులతో వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు వివిధ ప్రాంతాల్లో ప్రత్యక్షం అవుతారని టిడిపి నేతలు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. గత రెండేళ్లలో నిత్యవసర వస్తువులు ఆకాశాన్నంటాయని అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘోర వైఫల్యం చెందారన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని తనదైన శైలిలో విమర్శలు సంధించారు

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget