సర్వేపల్లిని సోమిబాబా- తెలుగు దొంగలు దోచుకున్నారు"సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి
  సర్వేపల్లిని సోమిబాబా- తెలుగు దొంగలు దోచుకున్నారు"


తేది:04-04-2021

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులతో పాటు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డా౹౹గురు మూర్తి గారికి అత్యధిక మెజారిటీ సాధించేందుకు ప్రచారం నిర్వహించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి
👉 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ధాటికి తట్టుకోలేక చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ అంటూ పలాయనం చిత్తగించాడు.


👉 ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సంతృప్తిగా ఉన్న ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిచి, చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధమయ్యారు.


👉 చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు సిద్ధాంతాలు లేకుండా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని ఓడించడమే ధ్యేయంగా పని చేస్తున్నారు.


👉 చంద్రబాబు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చినప్పటికీ లెక్కచేయకుండా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకుంటూ, తెలుగుదేశం పార్టీ పోటీ లేని చోట్ల ఇతర పార్టీలకు మద్దతు ఇస్తున్నారు.


👉 సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు ధాన్యం దొంగల అవతారమెత్తి, రైతులను దోచుకోవడంతో జైలుపాలయ్యారు.


👉 వ్యవసాయ శాఖ మంత్రిగా పనికిరాని ఉత్తర్వులు ఇచ్చి, ప్రలోభపెట్టే ప్రయత్నం చేసి, రైతుల చేత తిరస్కరింపబడిన వ్యక్తి, రైతుల గురించి ముసలి కన్నీరు కారుస్తున్నాడు.


👉 వ్యవసాయ శాఖ మంత్రిగా రైతులను అడ్డుపెట్టుకొని, గిట్టుబాటు ధర కల్పించకుండా, నీరు-చెట్టు, రైతు రథం లాంటి కార్యక్రమాల పేరిట వందల కోట్లు ప్రజా సొమ్ము దోచుకున్నాడు.


👉 అవినీతి సంపాదన ద్వారా వచ్చిన సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేసి, అందలమెక్కాలని ఆశపడ్డ వారికి, ఘోరపరాజయం తప్పలేదు.


👉 సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించడంతోపాటు, కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచి 3 కోట్ల 50 లక్షల విలువైన బియ్యం, వంటనూనెను పంపిణీ చేశాం.


👉 కరోనా నేపథ్యంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా భావించి మేము పని చేస్తే ,తెలుగుదేశం నాయకులు తమకు ఎక్కడ కరోనా వస్తుందోనని ముసుగుతన్ని పడుకొని, ప్రజలను పట్టించుకోకుండా వదిలేశారు.


👉 సర్వేపల్లి నియోజకవర్గాన్ని "సోమిబాబా-తెలుగు దొంగలు" అధికారాన్ని అడ్డుపెట్టుకొని, పంచభూతాలను దోపిడీ చేశారు.


👉 సర్వేపల్లి నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అందరం కష్టించి పనిచేసి, అత్యధిక పోలింగ్ శాతం సాధించడంతో పాటు, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి గారికి భారీ మెజారిటీ సాధించేందుకు తీవ్రంగా కృషి చేద్దాం.


👉 ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, అత్యధిక మెజారిటీతో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేసి, సర్వేపల్లి నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలుపుదాం.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget