ఒకే ఒక్క పర్యటనతో తెలుగుదేశం పార్టీ బలాన్ని రెట్టింపు చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు....

 నెల్లూరు జిల్లాలో


ఒకే ఒక్క పర్యటనతో తెలుగుదేశం పార్టీ బలాన్ని రెట్టింపు చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.... తిరుపతి ఉప ఎన్నికల్లో నల్లేరుపై నడకలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం ఖాయమైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటన తో పరిస్థితి ఒక్కసారిగా మార్చివేశారు. ముఖ్యమంత్రి భావించిన విధంగా భారీ మెజారిటీ సంగతి ఏమో కాని గత మూడు రోజులుగా ప్రచారంలో తెలుగు దేశం పార్టీ తన ప్రచారాన్ని హోరెత్తించింది మరోవైపు జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తనదైన శైలిలో అధికార పార్టీ పై విమర్శలు సంధిస్తూ రెచ్చిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపయర్లు లేకపోవడంతో ఆ పార్టీ ప్రచారం రోజురోజుకి వెలవెల పోతోంది.అయితే నెల్లూరు జిల్లాలో స్థానిక మంత్రులతోపాటు స్థానిక ఎమ్మెల్యేలు అత్యంత బలంగా ఉండటంతో వారి బలం పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి ఆధారపడ్డాడు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రచారంలో అంతగా ఆకట్టుకోలేక పోతున్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యేలు మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తూ ప్రజల్లో ముందుకు వెళ్తున్నారు...

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget