నెల్లూరుజిల్లాలో ఇవాళ ఒక్క రోజే 118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.

నెల్లూరుజిల్లాలో ఇవాళ ఒక్క రోజే 118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. గడచిన 24 గంటల్లో 2506 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 118 మందికి పాజిటివ్ రిపోర్టులు వచ్చినట్లు వెల్లడించారు. కొత్త కేసులతో కలిపి పాజిటివ్ కేసుల సంఖ్య 63వేలా 279 కి చేరాయి. జిల్లాలో యాక్టివ్ కేసులు 596కి చేరాయని, వారిలో 100 మంది జిజిహెచ్, నారాయణ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారని తెలియజేశారు. ఇక పోతే ఇవాళ నమోదైన పాజిటివ్ కేసుల వివరాల్లో కెళ్తే... అత్యధికంగా నెల్లూరు నగరంలో 61 కేసులు, ఇందుకూరు పేట మండలంలో 14 కేసులు నమోదయినట్లు పేర్కొన్నారు. గూడూరులో 6, సూళ్లూరుపేటలో 5, వెంకటాచలం, సైదాపురం మండలాల్లో నాలుగేసి చొప్పున కేసులు నమోదయ్యాయి. దగదర్తి, కావలి మండలాల్లో మూడేసి చొప్పున, ఆత్మకూరు, కోవూరు, ముత్తుకూరు, తోటపల్లి గూడూరు మండలాల్లో రెండేసి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అల్లూరు, ఏఎస్ పేట, బోగోలు, చిల్లకూరు, గూడూరు, కలువాయి, మనుబోలు, నాయుడుపేట, ఓజిలి, విడవలూరు మండలాల్లో ఒక్కో కేసు చొప్పున పాజిటివ్ కేసులు నమోదయినట్లు అధికారులు తెలియజేశారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget