గురుమూర్తి కి ఆశీస్సులందించండిసర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి

 గురుమూర్తి కి ఆశీస్సులందించండి."శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,




సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్ గురుమూర్తిగారు మార్చి 29వ తేదీ, సోమవారం ఉదయం నామినేషన్ దాఖలు చేస్తున్నందున ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ గురుమూర్తిగారు మార్చి 29 వ తేదీ, సోమవారం ఉదయం 9:30 నిమిషాలకు, వి.ఆర్.కళాశాల కూడలి నందు గల  మహనీయుడుడాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్  విగ్రహానికి నివాళులర్పించి, నాయకులు కార్యకర్తలందరితో కలిసి ర్యాలీగా బయలుదేరి, నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులైన ప్రజలు డాక్టర్ గురుమూర్తిగారికి అత్యధిక మెజారిటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.తిరుపతి పార్లమెంటుకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతోనే తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారానికి పూనుకుంది.ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలతో 2019 ఎన్నికల్లో కొంత మంది మద్దతు తెలిపితే, వాటిని అమలు చేసిన తీరు, విధానం చూసిన తర్వాత అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవడానికి సిద్ధంగా ఉన్నారు.

 తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గరనుండి మొత్తం పార్టీనంతా సమాయత్తం పరిచి, అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో దిమ్మ తిరిగిన విధంగానే మరోసారి ఘోరపరాజయం తప్పదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు అందరం కలిసికట్టుగా పని చేద్దాం.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget