తిరుపతి పి.యల్.ఆర్. కన్వెన్షన్ హాల్లో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ని పరిచయం చేసే కార్యక్రమం

  తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు ఈ నెల 16 న మంగళవారం నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో వెనువెంటనే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. డాక్టర్‌ గురుమూర్తిని పార్టీ అభ్యర్థిగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఖరారు చేశారు,ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రకటించారు. బుధవారం నుండి నామినేషన్ దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక  అభ్యర్థి  డాక్టర్ గురుమూర్తి ని పరిచయం చేసే కార్యక్రమం  తిరుపతి పి.యల్.ఆర్. కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు, ఈ సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ,పంచాయతీరాజ్ శాఖా మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిలు తిరుపతి పార్లమెంట్ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి నీ వైసీపీ ఎమ్మెల్యేలకు, వైసీపీ నేతలకు పరిచయం చేశారు. 


 ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ,పంచాయతీరాజ్ శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలుమాట్లాడుతూతిరుపతి ఉప ఎన్నికలో  రికార్డ్ సృష్టిస్తామని మంత్రి  ధీమా వ్యక్తం చేశారు. 3 లక్షల పైచిలుకుమెజారిటీసాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ భారీగా గెలిచామని తెలిపారు. సీఎం జగన్ పరిపాలన వల్లే ఈ ఫలితాలన్నీ వచ్చాయి అని పేర్కొన్నారు. 


 తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్‌ అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో ఉప ఎన్నిక జరుగుతోంది. దివంగత దుర్గాప్రసాద్ కుమారుడు బల్లి కల్యాణ చక్రవర్తికి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి  డాక్టర్‌ గురుమూర్తిని లోక్‌సభ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది అన్నారు,నమ్మిన సిద్ధాంతం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉంటారు అన్నారు. 


 సాధారణ ఫిజియోథెరపిస్ట్ అయిన గురుమూర్తి మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబానికి, వైసీపీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. వైసీపీ పెట్టినప్పటి నుంచి సీఎం జగన్ వెంట సామాన్య కార్యకర్తగా పని చేస్తూ వస్తున్నారు. ఫిజియోథెరపిస్ట్ కెరీర్‌నే వదులుకుని వైఎస్ ఫ్యామిలీ వెంట నిలిచారు. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన సమయంలో ఆయన సోదరి షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టగా ఆమె వెంటే నిలిచారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్ర చేపట్టగా, వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్‌గా గురుమూర్తి ఆయన వెంటే రాష్ట్రమంతా తిరిగారు. దీంతో సీఎం జగన్‌కు గురిమూర్తి అంటే ప్రత్యేక అభిమానం ఉందని అందరూ చెబుతుంటారు. పలు సందర్భాల్లో మంచి స్థానంలో నిలబెడతానని సీఎం జగన్ గురుమూర్తికి చెప్పారని వారు వెల్లడించారు. 


 ఈ తరుణంలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూయగా, ప్రతిపక్ష పార్టీలు పోటీకి సిద్ధం కావడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో అధికార వైసీపీ గత సంప్రదాయాలను పక్కన పెట్టి.. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యుడికి కాకుండా తన వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తికి సీఎం జగన్ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఈ విధంగా గురుమూర్తిపై తన అభిమానాన్ని చాటుకోవడంతో పాటు పార్టీ కేడర్‌కు సైతం  గురుమూర్తి విజయం కోసం శ్రమించి భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ ఇవ్వాలి అనీ పిలుపునిచ్చారు. 


 ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి , తిరుపతి పార్లమెంట్ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, తిరుపతి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ శాసనసభ్యులు,  వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి,కరుణాకర్ రెడ్డి,బియ్యం మధుసూదన్ రెడ్డి,కిలివేటి సంజీవయ్య, ఆనం రామనారాయణ రెడ్డి,వెలగపల్లి వరప్రసాద్ రావు,వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget