చిట్టమూరు మండలంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మీ ప్రచారం


 నెల్లూరుజిల్లా చిట్టమూరు మండలంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మీ ప్రచారం ప్రారంభించారు.. ఈ ప్రచారంలో మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే పాశం.సునీల్ కుమార్ తదితరులు హాజరయ్యారు. చిట్టమూరు టీడీపీ మండలాధ్యక్షులు గణపర్తి.కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు , అభిమానులు పాల్గొని వారికి ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో పనబాక లక్ష్మీ స్థానిక  మహిళలతో కలసి కొంత సేపు  కోలాటం ఆడి సందడి చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక.లక్ష్మీ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన మోడీ కి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అన్నారు.. విశాఖ ఉక్కు  ప్రైవేటికరణ , రాష్ట్ర సమస్యల పై  వైసీపీ ఎంపీ లు పార్లమెంట్ లో మాట్లాడలేదన్నారు..రాష్ట్ర విభజన సమయంలో పొందుపరిచిన దుగరాజపట్నం పోర్టును పూర్తి చేయలేకపోయారని విమర్శలు చేశారు. నాయుడు పేటలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఉద్దేశ పూర్వకంగా విద్యుత్ ను నిలిపివేసి ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. తనను గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని అభ్యర్ధించారు. మాజీ మంత్రి అమర్నాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెరిగిన ధరల విషయంలో ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందన్నారు..ఈ ఎన్నికల్లో వైసీపీ కి ఓటు వేస్తే జగన్ మోహన్ రెడ్డికి కళ్ళు నెత్తికి ఎక్కుతాయని అన్నారు...పోలీసులను అడ్డం పెట్టుకొని  దౌర్జన్యాలు, బయపెట్టడం ద్వారా ఎన్నికలు నిర్వహించారని అన్నారు..ప్రత్యేక హోదా సాధించడంలో జగన్మోహన్ రెడ్డి పూర్తి వైఫల్యం చెందాడని అన్నారు.. వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో అమ్మకి డబ్బులు ఇస్తూ నాన్న చేతిలో బుడ్డి రూపంలో లాక్కుంటుందని ఆరోపించారు.Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget