అధికారం లోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా రామాయ పట్నం, దుగ్గరాజపట్నం పోర్ట్ లు సాధించలేక వైసీపీ ప్రభుత్వం చతికిల పడింది. బీద రవిచంద్ర శాసన మండలి సభ్యులు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

 పార్టీ ఓటమికి కారణం కార్యకర్తలు కాదు - ఓటమికి అనేక  కారణాలు  :


బీద రవిచంద్ర శాసన మండలి సభ్యులు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి 


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన  వెంకటగిరి నియోజకవర్గ తెదేపా విస్తృతస్థాయి సమావేశం లో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ....


👉 రాష్ట్రంలో తొమ్మిది సార్లు సాధారణ ఎన్నికలు జరిగితే అత్యధికంగా కోవూరు నియోజకవర్గంలో 6 సార్లు, గూడూరు, సూళ్లూరుపేట  నియోజక వర్గాల నుంచి 5 సార్లు టీడీపీ గెలిచింది.


👉 ఎన్ని సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా గూడూరు డివిజన్ పరిధిలోని సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు లలో అత్యధిక సార్లు విజయం తెదేపా ను వరించింది.


👉 సూళ్లూరుపేట నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. గ్రామ, మండల స్థాయి లో నాయకులు, కార్యకర్తలు అత్యంత చురుకు గా అందుబాటు లో ఉంటారు.


👉 2019 లో టీడీపీ ఓడిపోవడానికి కారణం కార్యకర్తలు కాదు... ఎన్నికల్లో జరిగిన లోపాల కారణంగానే వైసీపీ మెజారిటీ సాధించింది.


👉 గతం లో చేసిన తప్పిదాలను సరి దిద్దుకుందాం. పార్టీ కూడా ఇక్కడ జరుగుతున్న తప్పిదాలను గుర్తించింది.


👉 తెదేపా రాష్ట్ర, పార్లమెంట్ కమిటీలలో సమర్థులకు , చురుకు గా వ్యవహరించే వారిని గుర్తించి బాధ్యతలు అప్పగించారు.


👉 అందరూ సమిష్టి గా పని చేసి, తెదేపా కంచుకోట అయిన నియోజక వర్గాల్లో వైసీపీ గెలిచిందన్న నింద ను తొలగించుకుందాం.


👉 2019 ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ చెప్పిన అబద్దం చెప్పకుండా చెప్పి ప్రజలను పక్క దారి పట్టించింది.


👉 కేంద్ర ప్రభుత్వం కు అమ్ముడు పోయామని, ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నామని నిందలు వేసింది. వైసీపీ అధికారం లోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తామని బీరాలు  పలికింది.


👉 ప్రత్యేక హోదా, పోలవరం నిధులకోసం తెదేపా ఎంపీ లు   ఎన్టీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు. మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు  పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు.


👉 కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ నేడు ప్రత్యేక హోదాను పక్కన బెట్టారు. 


👉 ఈనాడు వైసీపీ ప్రభుత్వం  తన స్వ ప్రయోజనాల కోసం  విశాఖ ఉక్కును సైతం తాకట్టు పెట్టింది.


👉 అధికారం లోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా  రామాయ పట్నం, దుగ్గరాజపట్నం పోర్ట్ లు సాధించలేక వైసీపీ ప్రభుత్వం  చతికిల పడింది.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget