నెల్లూరు గురించి రెండో మాటలేదు మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి

 నెల్లూరు విషయంలో మారో మాట లేదు... స్పష్టం చేసిన ఆనం


నెల్లూరు నగరం:


నెల్లూరు గురించి రెండో మాటలేదు, రెండోసారి ఆలోచించాల్సిన అవసరం లేదని మరోసారి కుండబద్దలు కొట్టారు మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. ఆనం కుటుంబం నాలుగు తరాల రాజకీయం నెల్లూరుతోనే కలసి ఉందని, తాము ఏ పార్టీలో ఉన్నా నెల్లూరు ప్రజలు తమ వెంటే ఉన్నారని గుర్తు చేశారు. ఇవాళ నెల్లూరులోని వారి నివాసంలో ఆనం విలేకరులతో మాట్లాడారు. రాబోయే కాలంలో  నెల్లూరు నగరంలో ప్రతి ఒక్కరినీ కలుస్తానని, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని అన్నారు. ఆనం కుటుంబం నెల్లూరుతోపాటు, రాపూరు, ఆత్మకూరు.. ఇలా అన్ని ప్రాంతాల్లో పోటీ చేసిందని, నెల్లూరు జిల్లా  మొత్తం తమకు అభిమానులు, అనుచరులు ఉన్నారని చెప్పారు.ఆనం సంజీవరెడ్డి, వెంకటరెడ్డి, ఏసీ సుబ్బారెడ్డి, తన అన్న వివేకానందరెడ్డి, తను కూడా నెల్లూరు నగరం నుంచి రాజకీయాలు చేశామని అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా తాను నెల్లూరు వైసీపీ అభ్యర్ధి గెలుపు కోసం ప్రచారం చేశానని, నెల్లూరుతో పాటు, గూడూరు, ఆత్మకూరులో కూడా తనను ప్రచారం చేయాలని అధిష్టానం ఆదేశించిందని అన్నారు. వచ్చే ఎన్నికలనాటికి అధిష్టానం ఎలా ఆదేశిస్తే అలా చేస్తానన్నారు రామనారాయణ రెడ్డి. పాత విషయాలు తెలియనివారు, అనుభవం లేక ఏదయినా అనుకోవచ్చని, అందుకే తానీ విషయాలన్నీ గుర్తు చేస్తున్నానని అన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget