కేతంరెడ్డి ఆధ్వర్యంలో జనసేనలో 100 మంది యువకులు చేరిక
 కేతంరెడ్డి ఆధ్వర్యంలో జనసేనలో 100 మంది యువకులు చేరిక

--------------------------------------------

జనసేన ఆలోచనలు ఆశయాల పట్ల యువత ఆకర్షితులవ్వడం ఆనందంగా ఉందని జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు..నెల్లూరు నగర నియోజక వర్గంలోని 40 మరియు 41 డివిజన్లకు చెందిన 100మంది యువకులు నెల్లూరు నగర కార్యాలయంలో  కేతంరెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు..వారిని కేతంరెడ్డి కండువా కలిపి పార్టీలోకి ఆహ్వానించారు..ఈ సందర్భంగా  కేతంరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగర నియోజక వర్గంలో పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో.. క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని..ప్రజల్లో ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన కలిగించి చైతన్య పరుస్తున్నామని

అందుకే యువత జనసేన పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు..వైసీపీ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోందని..ఇప్పటి వరకు జరిగిన పంచాయితీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనం అని ఆయన అన్నారు..రోజు రోజుకు జనసేనకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని అందుకే 6 శాతం ఓటింగ్ నుండి 18 శాతానికి చేరుకున్నామని ఆయన అన్నారు..రానున్న స్థానిక సంస్థల మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగించి ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకుపోతామని నెళ్లురు నగర నియోజక వర్గంలో జనసేన జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు..కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి,కాకు మురళి రెడ్డి,సురేష్ నాయుడు,కస్తూరయ్య యాదవ్, వెంకట్,హేమంత్ రాయల్,నాగరాజు,రాము,చరణ్,ఈశ్వర్,కేశవ,మహేష్,శివ,రాజేష్,హంస కుమార్ రెడ్డి,కృష్ణ,నరేంద్ర,హరి,సన్నీ,ఉదయ్,అక్షిత్, రాకి,గణేష్,పవన్,నవీన్,నాని,గోపి,సురేష్,తదితరులు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget