కొత్త సంవత్సరం ప్రజలకు సుఖ శాంతులను కలుగ చేయాలి -జనసేన క్యాలెండర్ ఆవిష్కరణ లో కేతంరెడ్డి వినోద్ రెడ్డి.


 కొత్త సంవత్సరం ప్రజలకు సుఖ శాంతులను కలుగ చేయాలి

-జనసేన క్యాలెండర్ ఆవిష్కరణ లో కేతంరెడ్డి వినోద్ రెడ్డి.

------------------------------------------------

2021 నూతన సంవత్సరం ప్రజలందరికీ ఆరోగ్యకరమైన,ఆనంద కరమైన సంవత్సరం గా ఉండాలని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆకాక్షించారు.జనసేన పార్టీ నెల్లూరు నగర కార్యాలయంలో జనసేనపార్టీ క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా కేతంరెడ్డి మాట్లాడుతూ..గత ఏడాది కాలం అంతా కరోనా కల్లోలం లో గడిచి పోయిందని, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతికిన మానవాళికి నూతన సంవత్సరం ఊరటను కలిగించాలని,ఆర్థికంగా దెబ్బతిన్న అన్ని వ్యవస్థలు  మెరుగు పడాలని జనసేన పార్టీ కోరుకుంటుందని ఆయన తెలియచేసారు...జనసేన  ఎన్.ఆర్.ఐ విభాగం పార్టీ కి వెన్ను దన్నుగా ఉంటూ ప్రజలకు విశేషమైన సేవలుఅందిస్తోందని, అందులో భాగంగా మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబిస్తూ ముద్రించిన క్యాలెండర్లను ప్రజలకు అందిస్తున్నారని తెలియచేసారు.  మన నది ని మన నుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని ఆయన అన్నారు..ప్రజలకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలియయచేశారు.


ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కాకు మురళి రెడ్డి,సర్వేపల్లి నియోజక వర్గ నాయకులు బొబ్బే పల్లి సురేష్ నాయుడు,హేమంత్,వెంకట్,చందు,వంశీ,విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget