నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, టి.పి.గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

*నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, టి.పి.గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, నాయకులతో కలిసి గ్రామాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

*నివర్ తుఫాన్ తో నారుమడ్లు దెబ్బతిన్న రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.*

*స్క్రోలింగ్ పాయింట్స్:*

👉నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గ్రామాల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాము.

👉ఇప్పటికే కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేయించి, గ్రామాలలో సిమెంటు రోడ్లు, సైడు కాలువల నిర్మాణం చేపట్టాము.

👉గ్రామాలలో అధికారులు, నాయకులు ఇద్దరూ సమన్వయంతో గ్రామ అభివృద్ధి పనులను ముందుకు తీసుకొని వెళ్ళాలి.

👉గ్రామాలలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు రోడ్లకు, డ్రైన్ల కు  అంచనాలు వేసిన నిధులలో ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా నిధులు విడుదల చేయిస్తాము.

👉పనులు అప్పగించిన సమయానికి ఖచ్చితంగా నాణ్యతతో పూర్తి చేయాలి.

👉 జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో వివిధ వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం 75 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది.

👉గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా  త్వరితగతిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలి.

👉 నివర్, బురేవి వరుస తుఫాన్లతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంతో పాటు నారుమడ్లు దెబ్బతిన్న రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేస్తున్నాం.

👉ఈ నెల  25 వ తేదీన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందజేస్తాము.

👉సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే భాగ్యం కల్పించిన నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget