రక్తదానం ప్రాణదానం తో సమానం నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

 





రక్తదానం  ప్రాణదానం తో సమానం


నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి


 

రక్తదానం ప్రాణదానం తో సమానమని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు నెల్లూరు లోని రాజన్న భవన్ వద్ద సోమవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు 


అంతకుముందు ఈ శిబిరాన్ని  పరిశీలించారు  అధిక సంఖ్యలో 

పాల్గొన్న యువకులతో  మాట్లాడారు. 


ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించడం ఎంతో సంతోషదాయకం అని పేర్కొన్నారు. 


యువకులు కూడా అధిక సంఖ్యలో ముందుకు రావడం మరెంతో స్ఫూర్తినిచ్చే విషయం అని అభిప్రాయపడ్డారు. 


రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ను ప్రతి ఒక్కరూ అభినందించాలని సూచించారు. 


మంత్రి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 


విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, వైసీపీ ముఖ్య నేతలు ముక్కాల ద్వారకానాథ్, రూప్ కుమార్ యాదవ్, 


స్వర్ణ వెంకయ్య, నూనె మల్లికార్జున యాదవ్, కోటేశ్వర్ రెడ్డి , నరసింహారావు, మధు, అల్లాబక్షు తదితరులు పాల్గొన్నారు

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget