ప్రభుత్వ నిర్ణయంపై జిల్లా కలక్టరేట్ వద్ద జర్నలిస్టుల ఆందోళన......


 ప్రభుత్వ నిర్ణయంపై జిల్లా కలక్టరేట్ వద్ద జర్నలిస్టుల ఆందోళన.......              జర్నలిస్టుల అక్రిడేషన్ కమిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పిలుపుమేరకు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సోమవారం జిల్లా జర్నలిస్ట్ లు ఆందోళన నిర్వహించారు .ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ మాట్లాడుతూ అక్రిడేషన్ కమిటీ లో యూనియన్లను తొలగించడం రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్ణయమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు వల్లూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అక్రిడేషన్ కమిటీ లో జర్నలిస్టు లేకుండా అధికారులతో ఏర్పాటు చేయడాన్ని ఏపీయూడబ్ల్యూజే తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు దయాశంకర్,  చంద్ర, మల్లికార్జున్, ఖాన్, జకీర్, హనోక్, రామూర్తి, సింగ్, రత్న ప్రసాద్ పాల్గొన్నారు .

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget