సిద్ధేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి దేవస్థానాలకు శంకుస్థాపన చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి

 నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం గ్రామంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలుగా బాసిల్లుతున్న సిద్ధేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి దేవస్థానాలకు 3 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.👉సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా పేరొందిన సిద్దేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి దేవస్థానం పునర్నిర్మాణంతో పాటు, అవసరమైన వసతులు కల్పించడానికి 25 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం.


👉 సర్వేపల్లి నియోజకవర్గంలో భక్తుల సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం.


👉 ఆలయాలకు దాతల ద్వారా సంక్రమించిన ఆస్తులను కాపాడుకునేందుకు ప్రజలందరూ సహకరించాలి.


👉 తెలుగుదేశం హయాంలో మూలస్థానేశ్వర స్వామి, వేణుగోపాలస్వామి ఆలయాలకు చెందిన సొమ్మును విరాళాల రూపంలో ఇతర జిల్లాలకు తరలించడాన్ని అడ్డుకున్నాం.


👉 సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలకు కమిటీలను నియమించడంతో పాటు, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, సజావుగా పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.


👉 రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆదరణతో పాటు భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నా.


👉సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రముఖ దేవాలయాలన్నింటినీ క్రమ పద్ధతిలో అవసరమైన పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడుతాం.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget