కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు.., మన-మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా స్వచ్చ సర్వేక్షణ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు*
*నెల్లూరు నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు.., మన-మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా స్వచ్చ సర్వేక్షణ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు* 

మన ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో.. అదే విధంగా గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ అని కలెక్టర్ తెలిపారు. 

స్వచ్చ సర్వేక్షణ్-2021లో జిల్లా వాసులు అందరూ ప్రభుత్వానికి సహకరిస్తూ.., ప్రతి గ్రామాన్ని, మున్సిపాలిటీని, కార్పొరేషన్ పరిశుభ్రంగా ఉంచి.., 

నెంబర్ 1 స్థానంలో నిలపాలని కోరారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ లో భాగంగా ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, ఇంటిలోని తడి, పొడి చెత్తలను వేరు చేసి హరిత రాయబారులకు అందించాలన్నారు. 

మనం-మన పరిశుభ్రత కార్యాక్రమాన్ని మొదటి విడతలో భాగంగా జిల్లాలో 189 గ్రామాలను ఎంపిక చేశామన్నారు. 

గ్రామాలను మోడల్ విలేజ్ లుగా తీర్చి దిద్దడానికి ఈ కార్యక్రమం చేపట్టామని, ఏ విధంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనే పద్దతులపై స్వచ్చ సర్వేక్షణ్ వాహనాల ద్వారా జిల్లాలో ప్రచారం చేస్తున్నామన్నారు. 

ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగంగా కావాలని, ముఖ్యంగా మహిళలు, యువత ఈ ఉద్యమానికి సహకారం అందించాలన్నారు. 

ప్రతి ఒక్కరూ ఏడాది కాలానికి ఖర్చు పెట్టే డబ్బులో..,  మొదటి స్థానంలో ఆహారం, 

రెండో స్థానంలో విద్య ఉంటే.., ఆ తర్వాత ఆరోగ్యంగా ఉండటం కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నామన్నారు. 

పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే వచ్చే వ్యాధుల వలన ఆస్పత్రి పాలు కావాల్సి వస్తుందని, డబ్బులు ఖర్చవుతాయని.., 

మరీ మఖ్యంగా ఎంతో విలువైన కాలాన్ని కూడా కోల్పోతామన్నారు. ఇలా జరగకూడదు అంటే గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంచడం అనేది అంతా.., మనచేతిలోనే ఉందన్నారు. 

ఇలా చేయడం ద్వారా మనతో పాటు భావితరాలకు కూడా మెరుగైన జీవనాన్ని అందించగలుగుతామన్నారు. 

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని భావించి, ఇంటినీ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని స్వచ్చ సర్వేక్షణ్-2021లో జిల్లాను నెంబర్ 1 స్థానంలో నిలపాలని కలెక్టర్ అన్నారు. 

ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
Labels:

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget