అమరావతి లో జరుగుతున్న 365 రోజుల రైతన్నల ఉద్యమానికి సంఘీభావంగా అబ్దుల్ అజీజ్


 అమరావతి లో జరుగుతున్న 365 రోజుల రైతన్నల ఉద్యమానికి సంఘీభావంగా  అబ్దుల్ అజీజ్ గారు మరియు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి అదేశాల మేరకు నగర మహిళా అధ్యక్షురాలు రేవతి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష....


ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు నగర నియోజకవర్గ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు హాజరయ్యారు....


ఈ సందర్బంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ....


అమరావతి రైతులకు వైసీపీ మినహాయించి అన్నీ పార్టీ లు మద్దతు తెలుపుతున్నాయాని, అందులో భాగంగా టీడీపీ కూడా రైతులకు మద్దతుగా, నిరసన చేస్తున్నాం అని అన్నారు...


వారికి సంఘీభావంగా మమ్మల్ని అమరావతి కి వెళ్లనివ్వకుండా, ప్రతీ కార్యకర్త కు నోటీసులు ఇచ్చారని అన్నారు...


గతం లో నాయకులకు మాత్రమే ఇచ్చేవారాని ఇప్పుడు ప్రతీ కార్యకర్తకు ఇచ్చారని అన్నారు...


రాజధాని రైతుల విషయం లో sc ల మీదే sc అట్రాసిటీ కేసు లు పెట్టించిన సిగ్గుమాలిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు...


తక్షణమే అమరావతి ని రాజధాని గా ప్రకటించి, రైతులకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేసారు....


ఈ సందర్బంగా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ...


రైతులను ఎంత ఇబ్బంది లు పెడుతున్న, వారి బిడ్డలను కొడుతున్న, వారి ని కొడుతున్నా సరే పోరాటం ఆపకుండా రైతుల కోసం పోరాడుతున్నారని అన్నారు...


రాజధాని విషయం లోనే కాదు, ప్రతీ విషయం లోను జగన్ మోహన్ రెడ్డి మాట తిప్పుతున్నారని అన్నారు...


ఎవరైనా రాజధాని కి వెళ్తే అన్నీ పనులు ఒకే చోట అయిపోవాలని అన్నారు..


వారికి సంఘీభావంగా అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వం లో నిరసన చేసిన తెలుగు మహిళలకు అభినందనలు తెలియచేసారు....


ఈ సందర్బంగా నెల్లూరు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు  పనబాక  భూలక్ష్మి మాట్లాడుతూ....


మహిళల పైన రైతుల దాడులు చేస్తున్న సరే, 365 రోజులు అమరావతి రాజధాని కోసం పోరాడినారు..


మహిళల పైన లాటి ఛార్జ్ చేయించి, అంతే కాకుండా కుక్కలతో పోల్చడం దుర్మార్గం అని అన్నారు...


ఈ సందర్బంగా నగర మహిళా అధ్యక్షురాలు రేవతి మాట్లాడుతూ....


 మూడు రాజధానులు పెడితే మహిళలకు ఇబ్బందిగా ఉంటుందని మహిళలు అంత దూరం ప్రయాణించ  లేరని అన్నారు....


 ఒక ఇంట్లో మహిళ ఏడిస్తే ఇంటికి మంచిది కాదని అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంది మహిళలు ఉసురు పోసుకుంటున్నారని ఆయనకు  పుట్టగతులు ఉండవు అని అన్నారు...


ఈ కార్యక్రమం లో మంగమ్మ ప్రమీల, బాణా, పద్మా, వెంకట లక్ష్మి, రమణమ్మ, వసంత, సురేఖ, వెంకట లక్ష్మి,  బుజ్జమ్మ, రాజ్యలక్ష్మి, లక్ష్మి, పార్వతి, ప్రభావతి, ప్రవీణ, విజయ, ధనమ్మనెల్లూరు రూరల్ మండల అధ్యక్షులు పముజుల ప్రదీప్, జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, నాగేంద్ర, సారంగి గున్నయ్య, నన్నెసాహెబ్, జాకీర్, రంగా, గిరిధర్, రవి, వెంకటేశ్వర్ల   పాల్గొన్నారు....

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget