గుంటూరు బాలికకు అరుదైన గౌరవం.. ట్రంప్ చేతుల మీదుగా సత్కారం

 


శ్రావ్యకు సత్కారం

అమెరికాలో తెలుగమ్మాయికి అరుదైన గౌవరం దక్కింది. గుంటూరు జిల్లాకు చెందిన శ్రావ్యకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతుల మీదుగా సత్కారం, అభినందనలు దక్కాయి. శ్రావ్య మేరీల్యాండ్‌లోని హ్యానోవర్‌లో తల్లిదండ్రులతో ఉంటోంది. శ్రావ్య తండ్రి విజయ్ రెడ్డి అన్నపరెడ్డి ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నారు. శ్రావ్య తోటి గర్ల్ స్కౌట్స్ టీమ్‌తో కలిసి నర్సులు, అగ్నిమాపక సిబ్బందికి వంద బాక్సుల కుకీలను అందించారు. హెల్త్‌కేర్ వర్కర్లను ప్రోత్సహించేలా గ్రీటింగ్ కార్డులను పంపింది. ఈ టీమ్ చిన్న సాయం అమెరికా అధ్యక్షుడి దృష్టిని ఆకర్షించింది.

కరోనా నుంచి ప్రజలను కాపాడుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అండగా నిలబడుతున్న ట్రంప్ అభినందించారు. వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సహాయం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. ట్రంప్ ప్రశంసలను అందుకున్న వారిలో శ్రావ్యతో పాటు లైలా ఖాన్, లారెన్ మాట్నీలకు ట్రంప్ ప్రశంసా పత్రాలను అందజేశారు. కరోనా వంటి సమయంలో ప్రతి ఒక్కరు సమాజానికి ఉపయోగపడేలా ఏదో ఒకటి చేయాలనే తాము చిన్న సాయం చేశామంటున్నారు. తాము చేసిన పని వేల మందికి ప్రేరణగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.


Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget