తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కాకాణి"*

*"తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కాకాణి"*
*నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలోని టి.పి.గూడూరు, ముత్తుకూరు వెంకటాచలం మండలాలలో తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి ప్రజలను పరామర్శించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

*నివర్ తుఫాన్ తో జలమయమైన లోతట్టు ప్రాంతాలు, కాలనీలను సందర్శించి, యానాది కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.*

*సర్వేపల్లి నియోజకవర్గంలో వాగులు పొంగి పొర్లడంతో తిరుమలమ్మపాళెం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకొని రాకపోకలు నిలిచిపోవడంతో, బోటులో వెళ్లి, గ్రామ ప్రజలను కలుసుకొని బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.*

*పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న కుటుంబాలను పరామర్శించి భోజనం, దుప్పట్లు, బిస్కెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

*తుఫాన్ ఉధృతికి ప్రమాదకర స్థాయికి చేరుకున్న చెరువులు, కాలువలు, వాగులతో పాటు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన  ఎమ్మెల్యే కాకాణి.*

*స్క్రోలింగ్ పాయింట్స్:*

👉నివర్ తుఫాన్ సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం.

👉 లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, భోజన, వసతి కల్పించడంతో పాటు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

👉 వరి నాట్లు దెబ్బతినడం, నారుమడ్లు నీట మునగడంతో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం అందిస్తాం.

👉 తుఫాన్ తో దెబ్బతిన్న ఉద్యానవన పంటలకు చెందిన నష్టాన్ని అంచనా వేసి, రైతులకు పరిహారం అందిస్తాం.

👉 మగ్గం గుంటలలో నీళ్లు వచ్చి ఇబ్బందులు పడుతున్న చేనేత కుటుంబాలను ఆదుకుంటాం.

👉 ధాన్యం అమ్మకాల ద్వారా రైతులకు రావలసిన డబ్బులను వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నారు.

👉 మిగిలిన పోయిన వారందరికీ మరో రెండు, మూడు రోజుల్లో నిధులు జమ చేయడం జరుగుతుంది.

👉 వర్షం కారణంగా దెబ్బతిన్న చెరువులు, కాలువలు, వాగులకు వెంటనే మరమ్మతులు చేపట్టి, రైతులకు  ఇబ్బందులు కలగకుండా చూస్తాం.

👉 గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన విద్యుత్తును పునరుద్ధరిస్తున్నాం.

👉 నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.

👉 తుఫాన్ నేపథ్యంలో సమర్ధవంతంగా విధులు నిర్వహించి ప్రజలకు అండగా నిలిచిన అధికారులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget