నివర్ తుఫాను కారణంగా అతలాకుతలం అయిన నెల్లూరు జిల్లాను వెంటనే ఆదుకోవాలని.. డీసీసీ అధ్యక్షులు చేవూరు.దేవకుమార్

 నివర్ తుఫాను కారణంగా అతలాకుతలం అయిన నెల్లూరు జిల్లాను వెంటనే ఆదుకోవాలని నెల్లూరు జిల్లా డీసీసీ అధ్యక్షులు చేవూరు.దేవకుమార్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


ఈ సంధర్భంగా పత్రికా ప్రకటన విడుదల చేస్తూ...


.జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ప్రజల సహాయయార్ధం సహాయక చర్యలను చేయవలసిందిగా సూచించారు.


.నివర్ కారణంగా పూర్తిగా దెబ్బ తిన్న సుమారు 300 KM ల మేర రోడ్డు మార్గాలను ప్రజల సౌకర్యార్థం వెంటనే మరమ్మతులు చేయాలని ప్రభుత్వానికి అధికారులకు సూచించారు.


.తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు దెబ్బ తిన్న సుమారు 150 చెరువులకు పూడికలు,మరమ్మతులు చేసి ప్రజాక్షేమం కోసం సహకటించాలని అధికారులను కోరారు.


.అకాల వర్షాలకు వరద నీరు చేరడంతో జిల్లాలో సుమారు 40 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పండించిన పంటలలు నీట మునిగి నష్టపోయిందని తెలిపారు.


.అంతేగాక తుఫాను ప్రభావంతో పూర్తిగా దెబ్బ తిన్న వరి,చెరుకు తదితర పంటలకు నష్టాన్ని అంచనా వేసి ఎటువంటి మీనమేషాలు లెక్కించకుండా సత్వరమే పంటల నష్ట పరిహారాన్ని పంటలు పండించి నష్టపోయిన రైతులకు అందించి జిల్లా రైతాంగానికి అండగా నిలవాలని ప్రభుత్వాన్ని,సంబంధిత అధికారులను కోరిన చేవూరు.దేవకుమార్ రెడ్డి.


.మరియు వరద నీరు అధిక మొత్తంలో చేరి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులపై తీవ్ర ఒత్తిడి పెరిగి ఆందోళనకరంగా ఉన్నాయని ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా గేట్లు ఎత్తివేసి ప్రజలను,ప్రాజెక్టులను పాలకులు,శాఖాపరమైన అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.


వర్షపు నీరు ఎక్కువగా చేరడంతో ఉరకలేస్తున్న పెన్నా నది చూపరులను ఆకర్షించి ఆహ్లాదాన్ని కలిగిస్తుంటే...

పెన్నా నది లోతట్టు పరివాహక ప్రాంతాల ప్రజలకు మాత్రం ఆందోళన కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేసిన చేవూరు..తక్షణమే పెన్నా నది లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని,వాళ్ల అవసరాలకు కావలసిన ఆహారపానీయాలను అందించవలసినదిగా అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget