అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి ఇతర నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

*నెల్లూరు జిల్లా, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి ఇతర నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

*స్క్రోలింగ్ పాయింట్స్:*

👉 భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి, అమరుడిగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు.

👉 పొట్టి శ్రీరాములు గారి పోరాటం, త్యాగ ఫలితమే, నేడు ఆంధ్రులకు గుర్తింపు లభించడానికి కారణం.

👉 భారత దేశానికి స్వాతంత్ర్యం రావడం కోసం, పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన పోరాటాలు అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

👉 పొట్టి శ్రీరాములు గారి పేరు నెల్లూరు జిల్లాకు పెట్టాలని ఆయన అభిమానులు ఎన్నిసార్లు వేడుకున్నా, ఏ ప్రభుత్వము పట్టించుకోకపోతే, మహనీయుడు వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు పొట్టి శ్రీరాములు గారి త్యాగ నిరతిని దృష్టిలో ఉంచుకొని నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేయడం జరిగింది.

👉 మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆశయ సాధన కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.

👉 అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆశయాలకు అనుగుణంగా, అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.

👉 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాం.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget