ధాన్యం విక్రయించిన 48 గంటల్లో డబ్బులు ఇస్తామన్నారు - 48 రోజులు గడిచినా ఇంతవరకు ఇవ్వలేదు - చేజర్ల వెంకటేశ్వర రెడ్డి


కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యలయములో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి  చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ

ఈ సంవత్సరం నెల్లూరు జిల్లాలో ఎడగారు సీజన్లో వరి సాగు చేసిన రైతుల బాధలు వర్ణనాతీతం

కరోనా వలన పెట్టుబడులు పెరిగినా రైతులు నానా తంటాలు పడి ఎలాగోలా పంటను పండించారు.అనేక వడిదుడుకులు ఎదుర్కొని పంట పండించడము ఒక ఎత్తు అయితే పండిన ధాన్యాన్ని అమ్ముకోవడం ఒక ఎత్తు అయింది

పండించిన ధాన్యానికి పుట్టికి రూ. 15,700 కు అమ్మవలసి ఉండగా కొనే నాధుడు లేక 8 వేలకు,9 వేలకు తెగనమ్ముకున్నారు

ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా  కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయవలిసి ఉండగా వారు మిల్లర్ల తో కుమ్మక్కు అయ్యి తరుగు పేరుతో రైతుల నుండి పుట్టికి 200 కేజీ ల నుండి 300 కేజీ లు అదనంగా ఇప్పించారు

రైతుల తరపున మాట్లాడి వారికి న్యాయం చేయవలిసిన మంత్రులు, అధికారపార్టీ శాసనసభ్యులు మిల్లర్ల తరుపున వకల్తా పుచ్చుకొని పుట్టికి 850 కేజీ లు ఇవ్వవలిసి ఉండగా 1050 కేజీ లు ఇచ్చే విధంగా ఒప్పందాలు చేశారు దేని వలన కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని అమ్మిన రైతులు పుట్టికి రూ 4 వేళ నుండి 5 వేళ వరకు నష్టపోయారు

కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు 48 గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం 48 రోజులు గడిచినా ఇంత వరకు డబ్బులు ఇవ్వలేదు

మాట్లాడితే ముఖ్యమంత్రి దగ్గరనుండి ఆ పార్టీ శాసనసభ్యులు వరకు మాది రైతు ప్రభుత్వం అని మాటలు  చెపుతూ చేతల్లో మాత్రం రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు.వైసీపీ నాయకులు బరితెగించి ధాన్యం కొనుగోళ్లలో కూడా అనేక అక్రమాలకు పాల్పడి రైతుల అన్యాయం చేశారు

అసలే పుట్టెడు కష్టాల్లో ఉన్న ధాన్యం రైతులకు  వెంటనే వారి బకాయిలు చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుమల్లి శ్రీహరి రెడ్డి,కావలి ఓంకార్,కలికి  సత్యనారాయణ రెడ్డి,జొన్నదుల రవికుమార్,వీరంశెట్టి మధుసూధన రావు,పాలూరు వెంకటేశ్వర్లు,పూల వెంకటేశ్వర్లు,ఇంటూరు విజయ్,గరికిపాటి అనిల్ ,గోపాల్ తదితరులు పాల్గొన్నారు

 

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget