రానున్న మూడ్రోజుల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలుఆంధ్రప్రదేశ్  లో రానున్న మూడ్రోజుల్లో భారీ వర్షాలు ( Heavy Rains ) కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. తూర్పు బంగాళాఖాతం ( Bay of Bengal ) లో ఏర్పడనున్న వాయుగుండం కారణంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.

తూర్పు మధ్య బంగాళాఖాతంలో..ఉత్తర అండమాన్ సమీపంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ ( IMD ) సూచించింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడ్రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా బలపడి.. పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆదివారం సాయంత్రంలోపు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య తీరం దాటనుంది. ఈ కారణంగా భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలుస్తోంది. సముద్రమంతా అల్లకల్లోలంగా ఉంటుందని..మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచనలు జారీ అయ్యాయి. ముందస్తుగా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాల్ని అప్రమత్తం చేశారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

శుక్రవారం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా...కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget