అన్నం పెట్టే రైతుల చేతులకు సంకెళ్లు

అన్నం పెట్టే రైతుల చేతులకు సంకెళ్లు వేయడం ఇప్పుడు ఏపీలోనే కాక తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారంగా మారింది. గుంటూరు జిల్లా పోలీసుల అత్యుత్సాహంతో ఏపీ సీఎం జగన్ ఇప్పుడు విపక్షాలకు లక్ష్యంగా మారారు. దుక్కులు దున్నే రైతన్నల చేతులకే బేడీలు, గొలుసులు వేసి కోర్టుకు తీసుకురావడం మీద సర్వత్రా నిరసనలు వ్యవక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు కారణం అయిన ఆరుగురు ఎస్కార్ట్ హెడ్ కానిస్టేబుల్స్ ని సస్పెండ్ చేశారు. అలానే ఆర్ఎస్ఐ , ఆర్ఐలకు చార్జ్ మోమోలు జారీ చేశారు.

అంతే కాదు అదనపు ఎస్పీతో విచారణకు ఆదేశించారు. కరోనా కారణంగా నరసరావుపేట సబ్ జైలు నుంచి 43 మంది రిమాండ్ లో ఉన్న అమరావతి రైతులను జిల్లా జైలుకు తరలించే క్రమంలో సంకెళ్ళు వేసి తీసుకు వెళ్ళడం జాతీయ స్థాయిలో పెను దుమారాన్ని రేపుతోంది.అమరావతికి పోటీగా ఆటోల్లో కొంత మందిని తీసుకొచ్చి, మూడు రాజధానులకు అనుకూలంగా ఉద్యమం మొదలు పెట్టారు కొంత మంది. అలా వేరే ఊరి నుంచి తమ ఊరి వచ్చి హడావిడి చేస్తున్న వారిని, అడ్డుకున్నారు రైతులు. దీంతో అడ్డుకున్నందుకు వారిని అరెస్ట్ చేశారు.

 

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget