నెల్లూరులో గాంధీ విగ్రహాన్ని అధికారులు గాలికొదిలేయడం భావ్యం కాదు -జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి
భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి కార్యకర్తల సమక్షంలో గాంధీబొమ్మ సెంటర్ లో గల మహాత్ముని విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. 
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ న్యాయపోరాటంలో అహింసా మార్గమే ఉత్తమమని ప్రపంచానికి చాటిన మహోన్నత నాయకుడు మహాత్మా గాంధీ అని  అన్నారు. సత్యమేవ జయతే అంటూ ఆయన చూపిన మార్గమే నేటికీ ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన సూత్రంగా అనేక దేశాల చట్టాల్లో పొందుపరచబడిందన్నారు. బ్రిటిష్ కబంధ హస్తాల్లోంచి దేశాన్ని రక్షించి స్వాతంత్యం తెచ్చిన ఆ మహనీయుని గౌరవించుకోవడం ప్రతి ఒక్క భారతీయని విధి అని అన్నారు. కానీ గత కొద్ది నెలలుగా నెల్లూరు నగరంలో ఆయన విగ్రహానికి జరుగుతున్న అవమానం సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నదని అన్నారు. నగర నడిబొడ్డులో ఉన్న విగ్రహానికి చేతి కర్ర, కళ్ళ జోడు వంటివి తొలగించడం, సీసాలు ఉంచడం, రంగులు పూయడం వంటి వాటిపై అధికారులు సరైన పర్యవేక్షణ చేసి బాగుచేయకపోవడం బాధాకరమన్నారు. గతంలో ఇలా జరిగితే జనసేన పార్టీ కార్యకర్తలు పూనుకుని విగ్రహాన్ని శుభ్రపరచి, చేతి కర్ర, కళ్ళజోడు పెట్టిన ఉదంతాన్ని గుర్తుచేశారు. గాంధీ జయంతి నాటి రాత్రికి కూడా విగ్రహం చేతిలో కర్ర లేకుంటే తమ కార్యకర్తలే విగ్రహాన్ని శుభ్రపరచి కర్ర ఉంచారన్నారు. నగరంలో సీసీ కెమెరాల ద్వారా ప్రతి ఒక్క కదలికను గమనిస్తున్నాం అంటున్న పోలీసు శాఖ వారు కావచ్చు, విగ్రహాలను పరిరక్షించాల్సిన మునిసిపల్ శాఖ వారు కావచ్చు, ఇతర జిల్లా అధికారులు నగరాన్ని సరిగ్గా పర్యవేక్షించకుండా మొద్దు నిద్ర వహిస్తున్నట్టు ఈ సంఘటనలు చూస్తే తెలుస్తోందన్నారు. ఇదే సందర్భంలో నేడు మరో జాతీయ నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనను సైతం జ్ఞప్తికి తెచ్చుకున్నారు. 
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, కాకు మురళి రెడ్డి,  మోష, శ్రీకాంత్ యాదవ్, కార్తీక్, హేమంత్, సంతోష్, చందు, గణేష్, రాము, రవి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget