రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
వై.ఎస్.ఆర్. రైతు భరోసా రెండో విడత చెల్లింపుల కార్యక్రమాన్ని మంగళవారం.., రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.., 2014లో పంట నష్టం జరిగితే 2017 జనవరి వరకూ ఇవ్వలేదని.., 2015లో ఖరీఫ్‌లో నష్టం జరిగితే 2016 నవంబరులో ఇచ్చారని.., 2016 ఖరీఫ్‌ లో నష్టం జరిగితే 2017 జూన్‌లో గత ప్రభుత్వం ఇచ్చిందన్నారు. 2017 రబీలో నష్టం జరిగితే.. 2018 ఆగస్టులో ఇచ్చారు. 2018 ఖరీఫ్‌లో నష్టం జరిగితే పూర్తిగా ఎగ్గొట్టారన్నారు. కానీ, ఇప్పుడు ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే.. ఆలస్యం కాకుండా వెంటనే పంట నష్టపరిహారం చెల్లించామని, మీ బిడ్డగా, గర్వంగా చెప్తున్నా..., రాష్ట్రచరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరులో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్‌లో పంట నష్టం జరిగితే.. రబీలోగా పరిహారం ఇవ్వగలిగితే.. రైతుకు మేలు కలుగుతుందనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి శ్రీ కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 50 లక్షల రైతు కుటుంబాలకు “రైతు భరోసా పథకం” ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు. 

నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ ప్రాంగణంలోని డి.ఈ.ఓ.సి నుంచి సీఎంతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో రాష్ట్ర విద్యుత్, పర్యావరణ శాఖామంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి శ్రీ పోలుబోయిన అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.., జిల్లాలో రెండో విడత వై.ఎస్.ఆర్. రైతు భరోసా పథకం ద్వారా 2,26,060 మంది రైతులకు.., 46 కోట్ల 74 లక్షల 855 రూపాయలు అందిందన్నారు. రైతు భరోసా పథకం మొదటి, రెండో విడతల్లో జిల్లాలో 2,26,060 మంది రైతు కుటుంబాలకు.., ద్వారా 170 కోట్ల 38 లక్షల రూపాయలు ప్రభుత్వం అందించిందన్నారు. జిల్లాలో జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాల వలన పంటలు నష్టపోయిన 4946 మంది రైతులకు ప్రభుత్వ 4 కోట్ల 99 లక్షల రూపాయల ఇన్ పుట్ సబ్సిడీ ప్రభుత్వం ద్వారా అందిందన్నారు. 


 

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget