చిన్నారులతో వెట్టిచాకిరీ చట్టరీత్యా నేరం - ఎస్సై కాసులు శ్రీనివాసరావు


తప్పిపోయిన చిన్నారుల ను తమ వారి చెంతకు చేర్చడంతో పాటు వారి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని  దేశ  ఉన్నత న్యాయస్థానం  సుప్రీంకోర్టు 2015 జూలై  ప్రవేశ పెట్టిన ఆపరేషన్ మస్కాన్ ద్వారా  దేశ వ్యాప్తంగా ఎనిమిది వేల రెండు వందల మందిని  తమ కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడం జరిగిందని ఇందులో భాగంగా     రాష్ట్ర పోలీసు శాఖ ఉన్నత స్థాయి అధికారుల  డీజీపీ   గౌతమ్ సవాంగ్  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్   ఆదేశాల మేరకు   సూళ్లూరుపేటలో  బుధవారం  ఆపరేషన్ మస్కాన్ చేపట్టి  పలువురు బాల కార్మికులకు బంగారు భవిష్యత్తు బాటపై అవగాహన కల్పించి వారిని సంక్షేమ గృహాలకు  తరలించడం జరిగిందని  కాసులు శ్రీనివాసరావు పేర్కొన్నారు .   అభాగ్యులైన చిన్నారుల చేత వెట్టి చాకిరికి పూనుకున్న  వారికి కఠిన శిక్షార్హులు అవుతారని, అనాథలు ఆసరా లేక వివిధ కారణాల వల్ల  బాల్యంలోనే  నరకయాతన లోనవుతూ  నలిగిపోతున్న  చిన్నారులకు రాష్ట్ర పోలీసుశాఖ అండగా నిలుస్తుందన్నారు. చట్ట వ్యతిరేకంగా Act 1986 ప్రకారం బాల కార్మికులను  ప్రోత్సహించే వారిపై   కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. పట్టణంలోని పలు మాంస విక్రయ దుకాణాలు వెల్డింగ్ మెకానిక్స్  పూల  దుకాణాల్లో  పనిచేస్తున్న పలువురిని గుర్తించి  వారిని ప్రభుత్వ   సంక్షేమ గృహాలకు తరలించి వారి   బంగారు భవిష్యత్కు బాటలు వేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు .

 

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget