అట్ట్రాసిటీ కేసును పెట్టడాన్ని నిరసిస్తూ పట్టణం లోని పార్టీ కార్యాలయం నుండి టవర్ క్లాక్ సెంటర్ నందున్న డా.బి.ఆర్.అంబేద్కర్ గారి విగ్రహం వరకు నాయకులు కార్యకర్తలతో కలసి నిరసన ర్యాలి

*గూడూరు నియోజకవర్గం(తెలుగుదేశం పార్టీ)* :  తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షులు శ్రీ నారా.చంద్రబాబునాయుడు గారి పిలుపు మేరకు...

రాష్ట్ర రాజధాని అమరావతి కొరకు భూములు ఇచ్చిన రైతులకు బేడీలు వేయడాన్ని  మరియు దళితులపై SC,ST అట్ట్రాసిటీ కేసును పెట్టడాన్ని నిరసిస్తూ పట్టణం లోని పార్టీ కార్యాలయం నుండి టవర్ క్లాక్ సెంటర్ నందున్న డా.బి.ఆర్.అంబేద్కర్ గారి విగ్రహం వరకు నాయకులు కార్యకర్తలతో కలసి నిరసన ర్యాలి చేసిన..

 *శ్రీ పాశిం.సునీల్ కుమార్ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు* 

నిరసన కాశర్యక్రమం అనంతరం మీడియా మాట్లాడుతూ...

గత 318 రోజులుగా రాజధాని రైతులు తమతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పoధాన్ని అమలు చేయాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నిరసన దీక్షలు చేయడం చేస్తున్నారని అన్నారు.

దానిలో బాగముగా అక్టోబర్ 23న రాజధాని నిర్మాణానికి గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోది గారి చేతుల మీదుగా భూమి పూజ చేయించి నందున భూమి పూజ చేసిన ప్రాంతంలో నిరసన కార్యక్రమం చేపట్టుటకు రాజధాని ప్రాంత రైతులు ప్రయత్నం చేయగా, ఆ ప్రాంతానికి కొంత మంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకువచ్చి వారి నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేయాలని YSRCP నాయకులు ప్రయత్నం చేయడం జరిగింది.

తరువాత రాజధాని రైతుల దీక్షా శిభిరానికి ఎదురుగా కొంత మంది పెయిడ్ ఆర్టిస్టులతో 3 రాజధానుల అనుకూల శిభిరాన్ని ఏర్పాటు చేసి రైతులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. ఈ క్రమంలో బయట గ్రామాల నుండి వస్తున్న ఆటోలను ఆపి మీది ఏ గ్రామం, ఇక్కడకి ఎందుకు  వస్తున్నారు, మీ ఆధార కార్డులు చూపించమని స్థానిక దళిత మరియు BC రైతులు వారిని అడిగితే రాజ్యాంగం లోనే లేని విధముగా దళితుల మీద SC,ST అట్ట్రాసిటీ యాక్ట్ పెట్టి జైలుకి పంపడం జరిగింది.

దళితులకు రక్షణ కల్పించవలసిన  SC,ST అట్ట్రాసిటీ యాక్ట్ వారి మెడకే గుది బండ చేసిన ఘనత ఈ YSRCP ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. అంతే కాకుండా దొంగలకు, ఉగ్రవాదులకు, నక్సలైట్లకు, హత్యా నేరాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు వేసే విదముగా, రాజధాని కోసం భూములు త్యాగం చేసి రాష్ట్రానికి అన్నం పెట్టె రైతులకు బేడీలు వేసి తీసుకు పోవడాన్ని నిరసిస్తూ ఈ రోజు పార్టి కార్యాలయం నుండి టవర్ క్లాక్ సెంటర్ వరకు ర్యాలి నిర్వహించి డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహమునకు వినతి పత్రం అందిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget