నాగలాపురం డబుల్ రోడ్డు నిర్మాణానికి 49 కోట్లు మంజూరు

నాగలాపురం డబుల్ రోడ్డు నిర్మాణానికి 49 కోట్లు మంజ
...........................................................
సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం వయా టిపి కోట మీదుగా డబుల్ రోడ్డు నిర్మాణానికి 49 కోట్లు రూపాయలు మంజూరు అయినట్టు స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి గత ఏడాది నవంబర్లో ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం టెండర్ల పక్రియ దశలో ఉన్నట్టు ఆయన చెప్పారు.వచ్చేనెల టెండర్లు పూర్తి కాగానే రోడ్డు పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. నాగలాపురం నుంచి వయా టి పి కోట మీదుగా పివి పురం వరకు 19 కిలోమీటర్ల మేర డబుల్ రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు.టెండర్ల ప్రక్రియలో జాప్యం జరగడం వల్లే రోడ్డు పనులు ప్రారంభించడంలో ఆలస్యం అవుతున్నట్టు ఆయన చెప్పారు.అయితే దీన్ని ఆసరా చేసుకుని ప్రతిపక్షం రాద్ధాంతం చేయడం తగదన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు గ్రామాభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని ఆర్థిక లోటు వెంటాడుతున్న అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా ఆంధ్ర ప్రదేశ్ ఉందన్నారు.ఇదే కాక జిల్లాలో వివిధ రోడ్ల అభివృద్ధి కోసం యన్డిపి పథకంలో 210 కోట్ల రూపాయలు మంజూరైనటు పేర్కొన్నారు. దీంతోపాటు ఆర్అండ్బీశాఖ ఆధ్వర్యంలో నాగలాపురంలో రెండు కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రి భవనం, వరదయ్యపాలెం మండలం చిన్నపాండ్ఊరు గ్రామంలో మరో రెండు కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనాలను నిర్మించడం జరుగుతుందన్నారు. ఇదేగాక సత్యవేడు మండలంలో గత రెండు దశాబ్దాలుగా కార్యరూపం దాల్చని దాసుకుప్పం బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన కొత్త ప్రతిపాదనలు సిద్ధమైందన్నారు. ఇప్పటికే ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదానికి పంపించినట్టు ఆయన చెప్పారు. దాసు కుప్పంలో బైపాస్ రోడ్డు లేకపోవడం వల్ల వాహనదారులకు, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తాను ఇది వరకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి దాసు కుప్పం బైపాస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు ఆయన గుర్తు చేశారు. అభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గడచిన ఏడాదిన్నర కాలంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. ఇందులో భాగంగానే పరిపాలనను ప్రజల ముంగిట్లోకి తీసుకు వెళ్ళడానికి గ్రామ సచివాలయాల ను ఏర్పాటు చేసి తద్వారా పౌర సేవలను అందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. నాడు నేడు పథకంలో ప్రభుత్వ బడులకు మౌలిక వసతులు కల్పించడం ద్వారా విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు చెప్పారు. రైతు భరోసా కేంద్రాలను గ్రామ సచివాలయ పరిధిలో ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన పనిముట్లు, ఎరువులు, విత్తనాలను అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు లేవన్నా

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget