ప్రజల గుండెల్లో ఎప్పటికీ సుస్ధిరం డా" వైఎస్ రాజశేఖరరెడ్డి..... నెల్లూరు వెంకటేశ్వర్ల రెడ్డి

ప్రజల గుండెల్లో ఎప్పటికీ సుస్ధిరం డా" వైఎస్ రాజశేఖరరెడ్డి..... నెల్లూరు వెంకటేశ్వర్ల రెడ్డి

ప్రజల గుండెల్లో ఎప్పటికి సుస్ధిర స్ధానాన్ని సంపాదించుకున్న ఏకైక నాయికుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని వైసీపీ పట్టణ ప్రచార కమిటీ అధ్యక్షుడు నెల్లూరు వెంకటేశ్వర్లు రెడ్డి తెలిపారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11 వర్ధంతి సందర్భంగా ఉదయగిరి రోడ్డులోని రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘణ నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు బ్రెడ్ ప్యాకెట్లు పంచి పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసిన ఘణత వైఎస్ రాజశేఖరరెడ్డి దని అన్నారు. ఈరోజు 108 ,కాని ఆరోగ్య శ్రీ కాని ఆయన ప్రవేశపెడితే ఎన్నో రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకొని అమలుపరచటం జరిగిందన్నారు. ఈరోజు పేదవాడు కార్పోరేట్ హస్పటల్ లో వైద్యం చేయించుకుంటున్నారంటే ఆయన ఘణత అని అన్నారు. అలానే ఆయన బాటలోనే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల గుండెల్లో స్ధానం సంపాదించుకున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను చేరువ చేసి పేదవారిని ఆదుకుంటున్నాడని తెలిపారు. ఆయన బాటలోనే మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా కావలి పట్టణాన్ని అభివృద్ధి పధంలో నడిపించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 25 వార్డు వైసీపీ నాయకులు ,కార్యాకర్తలు ,వైఎస్ అభిమానులు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget