'కధల' కొలను సదానంద ఇక లేరు!!!


ప్రముఖ రచయిత కలువకొలను సదానంద(81) మంగళవారం ఉదయం 11గంటలకు కన్నుమూసారు. ఆయన 1939లో పాకాలలో జన్మించారు. కాగా పాకాలలోనే ఆయన చివరి శ్వాస విడిచారు. ఆయనకధ,నవల, కవిత్వం ముఖ్యంగా గేయాలు వంటివి వివిధ ప్రక్రియల్లో రచనలుచేశారు. రచయితగానే కాకుండా చిత్రకారుడిగా ,కార్టునిస్టుగా కూడా ఆయన తెలుగు ప్రజలకు సుపరిచితులు. రక్తయజ్ఞం, పైరుగాలి, నవ్వేపెదవులు, ఏడ్చే కళ్లు మొదలైనవి వీరి కథా సంపుటాలు. గాడిద బతుకులు,గందరగోళం, బంగారుమామ వంటి నవలలు రాశారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి 1992లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా సత్కారాన్ని పొందారు. ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ సత్కారాన్నీ ఆయన పొందారు. ఎవరికోసం చెబుతున్నారో వారి చెంతకే వెళ్లి చెబుతున్నట్టుగా ఉంటుంది ఆయన శైలి. కపటం, మొహమాటం ఉండదు. మినహాయింపులు కూడా ఉండవు. చెప్పదల్చుకున్నది వీలైనంత వినయంగా, కళాత్మకంగా చెబుతారు. ఉత్తమ రచయితగానే కాదు ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరు పొందారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget