ఎప్పుడు రాజీనామా చేయమన్నా చేస్తా : వైసీపీ ఎమ్మెల్యే


ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి లేకపోతే రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదని జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. తనపై ఇన్నిరోజులుగా వస్తున్న పుకార్లపై స్పందించి ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు.
'నేను వైఎస్‌ వారసుడిని.. పార్టీ నుంచి ఎప్పటికీ బయటికి పోను. ఎంపీ రఘురామకృష్ణరాజు అలా ఎందుకు వ్యవహరిస్తున్నాడో అర్థంకావట్లేదు. వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్‌ ఇస్తేనే నిలబడతాను. ఎప్పుడు రాజీనామా చేయమన్నా చేస్తాను. నాపై అసత్య ప్రచారాలు చేయొద్దు. వైఎస్‌ కుటుంబాన్ని ఎదురించినవాళ్లు ఎవరూ బాగుపడలేదు. నా గెలుపునకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డే కారణం. అలాంటి కుటుంబాన్ని నేను ఎందుకు తిడతానుఅని సుధీర్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
కాగా.. 2019 ఎన్నికల్లో చాలా ట్విస్ట్‌ల మధ్య డాక్టర్. సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న సుధీర్.. టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిపై 51,941 భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల ఫలితాల అనంతరం రామసుబ్బారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పేసి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రామసుబ్బారెడ్డి రాకతో ఈయనకు.. ఎమ్మెల్యేకు మధ్య పొలిటికల్ వార్ నడుస్తోందని కూడా వార్తలు వినిపించాయి. మరోవైపు వీరిద్దరి మధ్య నెలకొన్న విబేధాలను క్యాష్ చేసుకునే పనిలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget