ఎడగారు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి... దోపిడీని అరికట్టాలి..పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి... మాజీ మంత్రి సోమిరెడ్డి


నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రెండో పంట చేతికొచ్చింది..వరికోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి..
1010 రకం ప్రభుత్వ ధర కామన్ వెరైటీకి రూ.15,720 రావాలి..కానీ రైతుల వద్ద  రూ.11,500కే కొంటున్నారు.. నెల్లూరు జిలకర ఫైన్ వెరైటీకి ప్రభుత్వ మద్దతు ధర రూ.15,980..కానీ రైతుల వద్ద మిల్లర్లు రూ.9800కి కొనుగోలు చేస్తున్నారు.. నెల్లూరు మసూరా క్రాసింగ్ (3354) పేరుతో కొత్త వంగడాన్ని ప్రభుత్వమే ప్రవేశపెట్టి అధిక దిగుబడి వస్తుందని రైతులను ఒప్పించి వేయించింది. కామన్ వెరైటీ కింద పుట్టికి రూ.15,720 రావాల్సివుంది. కానీ ఏపీ, తెలంగాణ వ్యాపారులెవరూ కొనుగోలు చేయకపోవడంతో చెన్నైలోని రెడ్ హిల్స్ లో రూ.8,000కి అమ్ముకోవాల్సిన దీనస్థితి రైతులకు ఏర్పడింది. వర్షాల కారణంగా చాలా చోట్ల పంట దెబ్బతింది. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.. మిల్లర్లు పుట్టికి(870) గాను నెమ్ము, తరుగు పేరుతో 960 నుంచి 1040 కేజీల వరకు తీసుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో బీపీటీ రకంలో విరుగుడు వచ్చింది. ఆ సమయంలో రైతులను ఆదుకునేందకు క్వింటాలుకు రూ.200 బోనస్ ఇచ్చాం. అంటే పుట్టికి రూ.1700 వరకు చెల్లించాం.. ఎన్ఎల్ఆర్ 34449 రకం విషయంలో మిల్లర్లు గ్రేడ్ 1 కింద రైతుల వద్ద కొనుగోలు చేస్తే ఎఫ్.సీ.ఐ గ్రేడ్ 2 రకంగా సేకరిస్తుండటంతో ఆ వ్యత్యాసం పేరుతో రైతుల వద్ద మిల్లర్లు 40 కిలోలు అదనంగా తీసుకుంటుండేవారు.. ఈ గ్రేడ్ వ్యత్యాస్యం భారం రైతులపై లేకుండా చేసేందుకు ప్రత్యేక జీఓ ఇప్పించాం. ఫైన్ వెరైటీ కింద రైతుల వద్ద కొనుగోలు చేయండి..ఆ తేడా మొత్తాన్ని మిల్లర్లకు సివిల్ సప్లయీస్ శాఖ ద్వారా చెల్లించేలా ఆదేశాలు ఇప్పించాం. ఈ జీఓ కారణంగా రైతులపై పుట్టికి రూ.630 వరకు భారం తగ్గింది.. అప్పట్లో రైతుల కోసం మేమంత చేస్తే మిల్లర్ల వద్ద ముడుపులు తీసుకున్నామని నిందలు మోపి కొందరు గొంతు చించుకున్నారు.. ఇప్పుడు తడి పేరుతో మిల్లర్లు రైతుల వద్ద వందల కిలోలు తీసుకుంటుంటే వాళ్లు ఏం చేస్తున్నారో.. తేమ పేరుతో దోచుకుంటున్నారని, ధరలను భారీగా తగ్గించేశారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ రెండేళ్లలో వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు...  రైతుల విషయంలో మేమెంతో శ్రద్ధ తీసుకున్నాం...అఖిలపక్షాన్ని తీసుకుని రైసు మిల్లర్ల వద్దకు వెళ్లాం...మిల్లులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాం.అయినా మమ్మల్ని కొందరు నానా మాటలు అన్నారు..

ఈ రోజు పరిస్థితులు ఇలా మారడం బాధాకరం...
ఏం ప్రభుత్వం అయినా రైతులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి...వెంటనే రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలి. గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు తరుగు పేరుతో జరుగుతున్న దోపీడీని అరికట్టాలి.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget