గోకుల్‌చాట్ ఘటనకు 13 ఏండ్లు!కరెక్టుగా ఇదే రోజు. హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పుడు కరోనాతో భయపడుతుంటే 13 ఏండ్ల కిందట పేలుళ్లకు భయపడ్డారు జనం. జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలు గోకుల్ చాట్‌, లుంబినీ పార్కులలో భారీ పేలుళ్లకు పాల్పడ్డారు ఉగ్రమూకలు. ఐదు నిమిషాల వ్యవధిలోనే వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపారు. 2007 ఆగస్ట్ 25 శనివారం వీకెండ్ కావడంతో చాలామంది పార్కులలో ప్రత్యక్షమవ్వడం కామన్‌. ఆ రోజు కూడా అదే జరిగింది. ఇదే అదునుగా ఎప్పటి నుంచో కాచుకు కూర్చున్న ఉగ్రమూకలు లుంబినీ పార్కు, గోకుల్ చాట్ స్థలాలను ఎంచుకున్నారు.
ఫస్ట్ లుంబినీ పార్క్‌ను ఎంచుకున్నారు. అక్కడ లేజర్ షో జరుగుతున్నప్పుడు సరిగ్గా సాయంత్రం7 గంటల 45 నిమిషాలకు ఒక పేలుడు జరిగింది. ఆ తర్వాత కేవలం 5 నిమిషాలకే గోకుల్‌చాట్ వద్ద మరో పేలుడు సంభవించింది. రద్దీగా ఉండే జనం ఈ పేలుళ్లకు భయపడి పరుగులు పెట్టారు. లుంబినీ పార్క్ వద్ద 10 మంది, గోకుల్‌చాట్ వద్ద 32 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలమంది గాయపడ్డారు.

ఈ సంఘటనలతో పోలీసులు అలర్ట్ అయి జన సమూహం ఉండే ప్రదేశాలలో తనిఖీ చేయించారు. దీంతో 20 బాంబులను వెలికి తీశారు. ఇండియన్‌ ముజాయిదీన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన అక్బర్ ఇస్మాయిల్‌, అనిఖ్ షఫీక్‌లకు ఉరిశిక్ష విధించారు. వీరికే కాదు ఉద్రవాదులకు ఆశ్రయం కల్పించిన తారీఖ్ అంజూమ్‌కు యావజ్జీవ శిఖను 2018లో నాంపల్లి ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించింది.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget