నెల్లూరు జిల్లా కలెక్టర్ గా కెవిఎన్ చక్రధర బాబు

నెల్లూరు జిల్లా కలెక్టర్ గా కెవిఎన్ చక్రధర బాబు.... నెల్లూరు జిల్లా కలెక్టర్ గా 2011 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ కె వి ఎన్  చక్రధర బాబు నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు... ప్రస్తుతం నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం వి ఎస్ శేషగిరిబాబు సెలవుపై ఉండటం తెలిసిందే... ఆయన ఇక తిరిగి నెల్లూరు జిల్లాకు రాకపోవచ్చని మొదటి నుంచి మనం చెబుతూనే ఉన్నాము... ఆయనను జీఏడికి  రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి... నెల్లూరు జిల్లాలో మంత్రులకు జిల్లా కలెక్టర్ కి మధ్య చాలా విషయాల్లో విభేదాలు నెలకొనడంతో ఎంవి శేషగిరిబాబు స్వచ్ఛందంగా తానే నెల్లూరు జిల్లాను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది... జిల్లా మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ మేకపాటి లు కూడా చక్రధర్ బాబుకు ఆమోద ముద్ర వేసారు.. దీంతో ఆయనను వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget