జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులతో సమీక్షా, సమావేశం... కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు.


నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని డి.ఈ.ఓ.సి నందు.., సోమవారం సాయంత్రం


కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు.., జాయింట్ కలెక్టర్ శ్రీ డా. వి.వినోద్ కుమార్ తో కలిసి.., జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులతో సమీక్షా, సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులతో మాట్లాడిన కలెక్టర్.., కరోనా మహమ్మారి నివారణ యాక్షన్ ప్లాన్ పై వారికి దిశానిర్దేశం చేశారు. తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు.., తమ పరిధిలో ప్రతిరోజూ నమోదవుతున్న కోవిడ్ కేసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, దానిని అంచనా వేస్తూ కరోనా వైరస్ ని అరికట్టడానికి సన్నద్దం కావాలన్నారు. ప్రతిరోజూ నెల్లూరు జిల్లాలో 4,000 వేల కోవిడ్ వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని.., దానిని ప్రకారం అధికారులు అందరూ పనిచేయాలన్నారు. ప్రతిరోజూ కోవిడ్ వ్యాధి నిర్థాణ పరీక్షలు పెరిగితే, దానికి తగినట్లు పాజిటివ్ కేసులు కూడా పెరుగుతాయని.., దీనివల్ల ప్రజల్లో కరోనా తీవ్రత పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోందని.., కానీ.., కేసులు సంఖ్య పెంచి.., పాజిటివ్ కేసులను గుర్తించి, వారిని క్వారంటైన్ కి తరలించి.., కాంటాక్టు వ్యక్తులను ట్రేస్ చేసి వారికి పరీక్షలు నిర్వహించి.., వ్యాధి లక్షణాలు ఉన్నవారికి మెరుగైన వైద్య చికిత్స అందించి, మరణాలు రేటును అరికట్టే లక్ష్యంతో పనిచేస్తున్నామని ప్రజలకు తెలియజేయాలని అధికారులకు కలెక్టర్ తెలిపారు. కోవిడ్ మహమ్మారి అంతానికి జిల్లా అధికారులు ప్రధానంగా ఐదు అంశాలపై దృష్టి పెట్టాలని కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు వారికి యాక్షన్ ప్లాన్ వివరించారు.

మొదట గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా తహసీల్దార్లు, స్పెషల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలు.., సర్వేలెన్స్ ను పటిష్టంగా చేపట్టాలన్నారు. ప్రతిరోజూ వాలంటీర్లు తమకు కేటాయించిన ప్రతి ఇంటినీ పరిశీలించాలని, ఎవరైనా కరోనా వ్యాధి లక్షణాలతో ఉన్నారా? అనేది గమనించాలన్నారు. ఆర్టీపిసీఆర్, ట్రూనాట్, ర్యాపిడ్ కిట్ ల ద్వారా టెస్టింగ్ పరీక్షలు విస్తృతంగా జరపాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికే 7 సంచార సంజీవిని బస్సులను జిల్లాకు కేటాయించిందని.., తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైన చోట వాటిని వినియోగించుకుని పరీక్షలు నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులు కరోనా పాజిటివ్ వ్యక్తుల షిప్టింగ్ బాధ్యతను తీసుకోవాలన్నారు. వైద్య నిపుణులతో సంప్రదించి.., కరోనా పాజిటివ్ వ్యక్తిని హోం క్వారంటైన్ లో ఉంచాలా..? కోవిడ్ కేర్ సెంటర్ కి తరలించాలా..? నిర్ణయించాలన్నారు. ప్రతి కోవిడ్ కేర్ సెంటర్ వద్ద ఎమెర్జెన్సీ సదుపాయాలతో అంబులెన్సులు అందుబాటులో ఉంచాలన్నారు. మైల్డ్, అసెంథమాటిక్ లక్షణాలు ఉన్న యువకులు, 45 ఏళ్ల లోపు వారిని గుర్తించి.., వారికి ఇంట్లో హోం ఐసోలేషన్ సదుపాయాలు ఉంటే..,  హోం క్వారంటైన్ లో ఉంచాలన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, పి.హెచ్.సి వైద్యులు హోం క్వారంటైన్ లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ గమనించాలని తెలిపారు. హోం ఆర్బిటీస్ ఉన్నవారు, సింటమ్స్ ఎక్కువగా ఉండి.., అధిక వయస్సు ఉన్నవారిని కోవిడ్ కేర్ సెంటర్ కి తరలించాలన్నారు. శ్వాసకోసం, హృదయ సంబంధ సమస్యలున్నవారిని కోవిడ్ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో బెడ్స్, టాయిలెట్స్, బలవర్థకమైన ఆహారం అందించాలని, అవసరమైన మందులు, మెడికల్ టీం ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి కోవిడ్ కేర్ సెంటర్ కి ఒక మెడికల్ సూపర్ వైజర్ ని నియిమించాలని ఆదేశించారు. హోం ఆర్బిటీస్ ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి సారించి వారికి.., వీలైనంత త్వరగా వారికి వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలందరూ తప్పకుండా మాస్కులు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, ఆరోగ్య వంతంగా ఉన్నవారు కూడా సి-విటమిన్ ఉన్న ఆహారం, బి-కాంప్లెక్స్, జింక్ విటమిన్ తీసుకునేలా అధికారులు ప్రజలకు మీడియా ద్వారా తెలియజేయాలన్నారు. సి- విటమిన్, బి-కాంప్లెక్స్, జింక్ తీసుకుంటే.., రోగ నిరోధక శక్తి పెరుగుతోందని.., దీని ద్వారా అసలు కరోనా వ్యాధి రాకుండా అడ్డుకట్ట వేయవచ్చని ప్రజలకు వివరించాలన్నారు. కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించగానే వారికి ముందుకు Dexamethasone టాబ్లెట్ ఇవ్వాలని.., వెంటనే కోవిడ్ కేర్ సెంటర్ లేదా కోవిడ్ ఆస్పత్రికి తరలించాలన్నారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే.., కరోనా వ్యాధి సోకినా మరణం సంభవించకుండా
చూడవచ్చని కలెక్టర్ అధికారులు స్పష్టం చేశారు. రాబోయే రెండు నెలలు ఎంతో కీలకమని.., కరోనా వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉందని.., అందువల్ల ప్రతిరోజూ అధిక సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించి.., పాజిటివ్ వ్యక్తులను గుర్తించి.., త్వరగా వారిని క్వారంటైన్ కి తరలించి.., మెరుగైన వైద్యం అందించి మరణాలను అడ్డుకునే విధంగా అధికారులు పనిచేయాలన్నారు. కోవిడ్ విధి నిర్వహణలో ఉండే అధికారులు కూడా తగిన జాగ్తత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజూ.., ఎంత మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు..? ఎన్ని పాజిటివ్ కేసులు నమోదైనాయి..? ఎంత మందిని క్వారంటైన్ కి తరలించారు..? ఎంత మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు..? ఎంతమందిని కోవిడ్ ఆస్పత్రికి తరలించారు అనేది.., డెయిలీ రిపోర్టు ఇవ్వాలని తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. మద్యం దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, నాన్ వెజ్ షాపుల వద్ద సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదని.., దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మాస్కులు ధరించని వారికి ఫైన్ విధించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలోనూ, ఎన్.ఆర్.జి.ఎస్ పనుల చేపట్టే సమయంలో సోషల్ డిస్టెన్స్, కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ డా. వి.వినోద్ కుమార్, ఆర్డీఓ లు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులు, జి.జి.హెచ్. సూపరింటెండ్, అధికారులు పాల్గొన్నారు. 

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget