కరోనా పట్ల పోలీసులు అప్రమత్తం గా వుండాలి ఆత్మకూరు డిఎస్పి మక్బూల్

కరోనా పట్ల పోలీసులు అప్రమత్తం గా వుండాలి

ఆత్మకూరు డిఎస్పి మక్బూల్

పొదలకూరు మేజర్ న్యూస్

కరోనా పట్ల పోలీసులు నిర్లక్ష్యం గా వుండకుండా, అప్ర మత్తంగా ఉండాలని, కేసులు పెరుగుతున్నందున చాలా జాగ్రత్తలు తీసు కోవాలని ఆత్మకూరు డీఎస్పీ మక్బూల్ విజ్ఞప్తి చేశారు. ప్రజలను జాగృతం చేసే కాపాడే బాధ్యత పోలీసులు, అధికారులతో పాటు మీడియాకు ఉందని, విలేకరులు తగిన రక్షణ చర్యలు తీసుకుని వార్తల సేకరణ చేయాలని సూచించారు. శనివారం ఆయన స్థానిక పోలీసు స్టేషను ను సందర్శించి కోవిడ్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి, పోలీసులకు దాతలిచ్చిన శానిటైజర్లు, ఫేస్ షీల్డ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కేసులు పెరగకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ బాధ్యతతో మెలగాలన్నారు. ప్రజలు పరిమిత సమయంలో, అత్యవసరమైతేనే రోడ్లపైకి రావాలన్నారు. ఫిర్యాదు దారుల నుంచి ఫిర్యాదులను  పోలీసు స్టేషను భవనం వెలుపలే నిర్దేశిత ప్రాంతంలో భౌతిక దూరం పాటిస్తూ తీసుకోవాలన్నారు. మాస్కులు, భౌతిక దూరం, స్టేషన్ బయట బల్ల పై శానిటైజర్ల వినియోగం తప్పనిసరిగా ఉపయోగించేలా చూడాలన్నారు.పోలీసులు ఆరోగ్యం ఉంటేనే సాధారణ ప్రజలను కాపాడగలమన్నారు. పని లేకున్నా బయటకు రావద్దని ఎంత చెప్తున్నా ఖాతరు చేయకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని అందరూ గ్రహిస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుం దన్నారు. సరైన ఆహార పదార్థాలు , వేడి నీరు, నిమ్మరసం తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తతో మెలగాలని, ముద్దాయిలను పట్టుకొనే సందర్భంలో గ్లౌజులు ధరించాలన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక సీ.ఐ గంగాధరరావు, ఎస్.ఐ రహీం రెడ్డి, కండలేరు డ్యామ్ ఎస్ .ఐ లేఖా ప్రియాంక, పోలిసులు , ఫేస్ షీల్డ్స్ దాత తన్నీరు సాయిచందు , శీను తదితరులు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget